వారంలో ఇంటర్ ఫలితాలు.. సెకండ్ ఇయర్ క్లాసులు షెడ్యూల్..!

తెలంగాణాలో ఇంటర్ విద్యార్ధులకు స్పెషల్ అప్డేట్ వచ్చింది.తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.

 Telangana Inter Results In One Week Inter Board Secretary Umar Jaleel , Telangan-TeluguStop.com

వారం రోజుల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు.అంతేకాదు ఆన్ లైన్ క్లాసులపై కూడా పలు అంశాలు ప్రస్థావించారు.

జూలై 1వ తేడీ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని.ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు ముగిసిన అనంతరం మొదటి సంవత్సరం విద్యార్ధులకు జూలై మిడిల్ లో నుండి క్లాసులు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

విద్యా సంవత్సరం మొదలు కాకముందే కళాశాల యాజమాన్యం విద్యార్ధుల నుండి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

లాస్ట్ ఇయర్ లానే ఈ 2021-22 విద్యా సంవత్సరం కూడా 70 శాతం సిల్బస్ ఆధారంగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని చెప్పారు.

టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని విద్యార్ధులకు కాలేజీల లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.ఇందుకు గాను ఇప్పటికే 200 ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.

వారంలోగా ఫలితాలతో పాటుగా తదుపరి కార్యచరణ మరోసారి వెల్లడిస్తామని అన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube