కెనడా: నాడు బిల్లుకు మద్దతు.. ఆరేళ్ల తర్వాత ముస్లింలకు భారత సంతతి ఎంపీ క్షమాపణలు

ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా రూపొందించిన బిల్లుకు మద్ధతు ఇచ్చినందుకు గాను భారత సంతతికి చెందిన కెనడా మాజీ మంత్రి, ప్రస్తుత కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ టిమ్ ఉప్పల్‌ క్షమాపణలు చెప్పారు.2015లో అప్పటి ప్రధాని స్టీఫెన్ హార్బర్ ప్రభుత్వంలో మంత్రిగా ఆయన పనిచేశారు.కెనడా పౌరసత్వం తీసుకుంటూ ప్రమాణం చేసే సమయంలో ముస్లిం మహిళలు తమ ముఖం కనిపించకుండా ముసుగు ( నిఖాబ్) ధరించడాన్ని నిషేధించాలన్నది ఆ బిల్లు సారాంశం.

 Indian Origin Ex Minister Sorry For Backing Proposed Anti Muslim Bill, Prime Min-TeluguStop.com

నాటి బిల్లుకు టిమ్ ఉప్పల్ మద్ధతు పలికారు.

అయితే ఇస్లామోఫోబియా వాదియైన 20 ఏళ్ల నాథనియల్ వెల్ట్‌మన్‌పై ఉగ్రవాద ఆరోపణలు చేస్తూ టిమ్ ఉప్పల్ నాటి బిల్లుకు మద్ధతు పలికినందుకు గాను బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.వెల్ట్‌మన్ జూన్ 6న ఒంటారియోలోని హామిల్టన్ నగరంలో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసినట్లుగా అభియోగాలు వున్నాయి.

టిమ్ ఉప్పల్ ప్రస్తుతం ఎడ్మంటన్ మిల్ వుడ్స్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Telugu Conservative Mp, Islamophobia, Tim Uppal-Telugu NRI

నాథనియల్ దాడి ఘటన తర్వాత ఫేస్‌బుక్ ద్వారా స్పందించిన టిమ్ ఉప్పల్.2015లో ప్రతిపాదిత బిల్లు వల్ల తమ పార్టీకి కెనడియన్లు దూరమయ్యారని ఆయన తెలిపారు.అంతేకాకుండా దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియోకు ఇది మరింత ఆజ్యం పోసినట్లయ్యిందని ఉప్పల్ అంగీకరించారు.

అంతిమంగా ఈ చర్యల వల్ల 2015లో జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్స్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని ఆయన తెలిపారు.తాను మరొకరి భావనను ప్రోత్సహించే విభజనకు వ్యతిరేకంగా తన పదవిని ఉపయోగించాలని.

కానీ అందుకు భిన్నంగా వ్యవహరించినందుకు గాను క్షమాపణలు చెబుతున్నానని టిమ్ ఉప్పల్ తన ఫేస్‌బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు.ఇక హామిల్టన్ దాడిని ప్రస్తావిస్తూ.ఇది విషాదకర వారంగా ఆయన అభివర్ణించారు.ఉగ్రవాది పైశాచికానికి బలైన కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube