ఇకపై మీ ఇంట్లో విద్యుత్ మీటర్ రీడింగ్ మీరే స్కాన్ చేసి కరెంట్ బిల్ కట్టోచ్చు.. ఎలాగంటే..?!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.అయితే ఇప్పటి వరకూ లాక్ డౌన్, కర్ఫ్యూల వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండేది.

 Now You Can Scan The Electricity Meter Reading In Your House And Pay The Current-TeluguStop.com

దీని వల్ల నగదు చెల్లింపులన్నీ ఆన్ లైన్ లో చేయడం ప్రజలు అలవాటు చేసుకున్నారు.చాలా మంది బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం వల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేపడుతున్నారు.

దీనివల్ల వారికి శ్రమ కూడా తగ్గుతుంది.అంతేకాదు అతి సులభంగా నగదు చెల్లింపులు చేయవచ్చు.

కొన్నింటికి క్యాష్ బ్యాక్ ను కూడా పొందవచ్చు.తాజాగా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుండటం వల్ల APEPDCL విద్యుత్ సంస్థ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఓ వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టింది.ఈ విద్యుత్ సంస్థ ఓ సరికొత్త యాప్ ను విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు చేపట్టింది.

ఈ కొత్త యాప్ ద్వారా మీ ఇంట్లో విద్యుత్ మీటర్ రీడింగ్ ను వారే స్కాన్ చేసి కరెంటు బిల్లు కట్టవచ్చు.

Telugu Apepdcl, Electric Meter, Pay, Scan-Latest News - Telugu

మీరు కనుక స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నట్లైతే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సులభంగా బిల్లును కట్టేయవచ్చు.ముందుగా మీరు విద్యుత్ సంస్థ ఏర్పాటు చేసిన APEPDCL యాప్ డౌన్‌లోడ్ చేసుకువాల్సి ఉంటుంది.ఆతర్వాత మీటరు రీడింగ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.

అప్పుడు ఆ స్కాన్ ద్వారా ఎంత బిల్లు అయ్యిందో తెలుస్తుంది.అప్పుడు మీరు ఆ అమౌంట్ ను చెల్లించవచ్చు.

ఈ విధానాన్ని మే నెల నుంచే ప్రవేశపెట్టారు.మీటరు రీడింగ్ తీసే తేదీని ముందుగానే ఆ బిల్లుపై ప్రచురించడం వల్ల ప్రతినెలా అదే తేది మీటరు రీడింగ్ తీయాల్సి ఉంటుంది.

కరోనా కాలంలో విద్యుత్తు శాఖ వినియోగదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే ఎంతోమందికి ఈ యాప్ వల్ల ప్రయోజనం కలుగుతుంది.ఇప్పటికే ఈ యాప్ ను 2,49,681 మంది ఇన్ స్టాల్ చేసుకున వినియోగిస్తన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube