డాబు రథాని క్యాలెండర్ పై మొదటి సారి ఓ సౌత్ హీరో

బాలీవుడ్ లో డాబు రథాని క్యాలెండర్ కి మంచి గుర్తింపు ఉంది.ఈ క్యాలెండర్ పై బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అందరూ ఫోజులు ఇచ్చారు.

 Vijay Devarakonda In Dabu Rathani Calendar, Liger Movie, Tollywood, Puri Jaganna-TeluguStop.com

ఇక ఈ క్యాలెండర్ లో కనిపించడం బాలీవుడ్ స్టార్స్ అందరూ ఒక గౌరవంగా భావిస్తారు.అంత ప్రాధాన్యత డాబు రథాని క్యాలెండర్ కి ఉంది.

అయితే ఈ క్యాలెండర్ పై మొదటి సారి ఒక సౌత్ హీరోకి స్థానం లభించింది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటి సారి సౌత్ నుంచి డాబు రథాని క్యాలెండర్ పై కనిపించబోతున్న హీరోగా అరుదైన గౌరవం అందుకోనున్నాడు.

హీరో, హీరోయిన్స్ నాలో సెక్సీ అప్పీల్ ని ప్రెజెంట్ చేయడంలో డాబు రథానికి ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది.ఈ నేపధ్యంలో మ్యాన్స్లీ లుక్ తో అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయిన విజయ్ దేవరకొండ కూడా డాబు రథానిని ఆకర్షించడం విశేషం.

Telugu Bollywood, Daburathani, Liger, Puri Jagannadh, Tollywood-Movie

ఇక రీసెంట్ గా అతను ఆ క్యాలెండర్ ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ రీసెంట్ గా మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో ఇండియన్ వైడ్ గా రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇప్పుడు ఏకంగా క్యాలెండర్ పైకి ఎక్కాడు.ఇక బాలీవుడ్ భామలు సైతం ఇప్పటికే విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ గా మారిపోయారు.ఇక అతనితో జత కట్టడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా గాని హిట్ అయితే బాలీవుడ్ లో రౌడీ స్టార్ హవా మొదలైపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube