గూగుల్‌ నయా టెక్నాలజీ.. మనిషి కంటే స్పీడ్‌గా ఆలోచించే చిప్స్‌ ఆవిష్కరణ!

గూగుల్‌ దిగ్గజ కంపెనీ ఓ నయా టెక్నాలజీని రూపొందిస్తోంది.ఎప్పుడూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే గూగుల్‌ ఇప్పుడు ఈ సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది.

 Google Designing Artificial Intelligence For New Technology Chips.latest News-TeluguStop.com

మనిషి ఒక రోజు చేసే పనిని కేవలం ఒక్క గంటలోనే పూర్తి చేసే గూగుల్‌ కొత్త టెక్నాలజీ పని చేయనుంది.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో చిప్స్‌ను రూపొందిస్తుంది.

ఆ వివరాలు తెలుసుకుందాం.దీన్ని మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా తయారు చేస్తున్నారు.

ఇంతకీ ఈ ఏఐ చిప్స్‌ ఎంత వేగంగా పనిచేస్తుందో మరి.కొన్ని ఏళ్లుగా గూగుల్‌ ఈ చిప్స్‌ తయారీలో నిమగ్నమైంది.ఇటీవల దీని పరిశోధన మొదలు పెట్టింది.ఈ నయా సాంకేతికతకు కంప్యూటేషన్‌ ఆప్టిమైజేషన్‌కు గూగుల్‌ వాడే టెన్సార్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో తీసుకొస్తున్నారు.సైంటిస్టులు చిప్స్‌పైన ట్రాన్సిస్టర్లను పెంచకుండా.వాటి పనితనం పెంచేలా ఈ ప్రయోగం రూపొందిస్తోంది గూగుల్‌.

సాధారణంగా అల్గారిథమ్స్‌ ఎక్కువగా ఫ్లోర్‌ ప్లానింగ్‌ను టాకిల్‌ చేస్తూ ఉంటాయి.

Telugu Chips, Google-Latest News - Telugu

చిప్‌ సబ్‌ సిస్టమ్స్‌ కోసం సిలికాన్ డైలోని లే అవుట్‌ వెతకడానికి హ్యూమన్ డిజైనర్లు సిస్టమ్స్‌ వాడుతుంటారు.దీని కోసం సీపీయూ, జీపీయూ, మెమొరీ కోర్స్‌ ఉంటాయి.ఆ ప్లేస్‌మెంట్‌ వల్లే చిప్‌ వేగం పెరుగుతుంది.ఈ ఫ్లోర్‌ డిజైనింగ్‌ను మనుషులు చేయడానికి ఎక్కువ సమయం పడుతోందని గూగుల్‌ గుర్తించింది.ఇప్పటికే మనుషుల్ని మించి పనితనం చూపిస్తుందంటూ ఏఐ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు.ఈ లెక్కన ఫ్లోర్‌ ప్లానింగ్‌ను కూడా ఏఐ సరిగ్గా చేస్తుందని, అందులోనూ స్పీడ్‌గా చేస్తుందని గూగుల్‌ భావిస్తోంది.

ఇందులో భాగంగా లెర్నింగ్‌ అల్గారిథమ్‌కు పదివేల చిప్స్‌ ఉన్న ఫ్లోర్‌ ట్రైనింగ్‌ ఇచ్చారట.ఈ క్రమంలో గుడ్, బ్యాడ్‌ ఫ్లోర్‌ ప్లాన్స్‌ను అల్గారిథమ్‌ నిర్ణయించుకునేలా శిక్షణ ఇచ్చారు.

ఏఐ సిస్టమ్స్‌ మనుషుల్లా ఆలోచించవు అని బోర్డు గేమ్స్‌ ఆడే క్రమంలోనే తెలిసిపోయింది.అలాగే ఫ్లోర్‌ ప్లాన్స్‌ విషయంలోనూ గూగుల్‌ ఏఐ నడుచుకుంటుంది.

మనుషులు చేసే ఫ్లోర్‌ డిజైన్‌తో సిద్ధం చేసిన ఫ్లోర్‌ డిజైన్ లో చాలా తేడాలు కనిపించాయట.దీని వల్ల కచ్చితంగా వేగంలో మార్పు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలా గూగుల్‌ రూపొందిస్తున్న కొత్త టెక్నాలజీ ఆధారంగా అది మనిషి ఒక రోజులో చేసే పనిని ఏఐ చిప్స్‌ కేవలం ఒక గంటలోనే నిర్వర్తిస్తాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube