స్పాకెళ్లి బాడీ మసాజ్ చేయించుకున్న గుడ్లగూబ.. ఐలవ్ యూ చెబుతున్న రామచిలుక..!

సోషల్ మీడియాలో ఈ మధ్య వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఎప్పుడూ ఏ దేశంలో ఏ క్షణంలో ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు.

 Viral Video Owl Went To Spa For Bath Parrot Proposed The Owl , Viral Video , Owl-TeluguStop.com

ప్రపంచంలో జంతువులు చేసే అన్నీ విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు.తాజాగా కొన్ని జంతువుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రపంచంలో అన్నీ జంతువులు చేసే పనులను, వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టు చేస్తుంటారు.అలాంటి వీడియోలే ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు.

రెండు పక్షులుకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఓ గుడ్ల గూబ స్నానం కోసం స్పా కి వచ్చింది.

మరొకటి రామచిలుక ప్రపోజ్ చేస్తోంది.ఈ రెండు వీడియోలు నెటిజన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

చాలామంది ఈ వీడియోలకు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోలను చూసి వావ్ అంటున్నారు.

గుడ్లగూబలు సామాన్యంగా మనుషుల మధ్య తిరగలేవు.అలాంటిది ఓ గుడ్లగూబ స్పాకి వెళ్లింది.అంతేకాదు స్పాలో చికిత్స తీసుకుంది.స్పా సిబ్బంది చేత ఆ గుడ్లగూబ మసాజ్ చేసుకుంది.

దీంతో గుడ్లగూబకు స్నానం చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.స్నానం చేసిన తర్వాత ఆ గుడ్లగూబ చాలా అందంగా కనిపిస్తోంది.

ఈ వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా బ్యూటెంగేబీడెన్‌ లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరో వీడియోలో ఓ చిలుక చాలా ముద్దుగా మాట్లాడింది.పసిఫిక్ కు చెందిన రెండు సంవత్సరాల చిలుక తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంటోంది.నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆ చిలుక ముద్దు ముద్దుగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియోను పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి.లక్షల లైక్స్ వచ్చాయి.హ్యూమన్ జెన్నిఫర్ అంటూ ఆ వీడియో కి క్యాప్షన్ ఇవ్వడంతో చాలా మంది వీడియోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube