ఆ విషయంలో కేటీఆర్ ను పక్కకు పెట్టిన కేసీఆర్ ?

టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ తర్వాత అన్ని వ్యవహారాలను చక్కబెట్టేది ఆయన తనయుడు మంత్రి కేటీఆర్.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ అన్ని విషయాల్లోనూ క్లారిటీ తోనే ఉంటారు.

 Ktr Is Unresponsive In The Case Of Etela Rajender, Kcr, Ktr, Telangana, Etela R-TeluguStop.com

పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు ఎదురైనా వాటిని చక్కదిద్దుతూ ఉంటారు.కానీ కొద్ది రోజులుగా తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన ఈటెల రాజేందర్ వ్యవహారంలో కేటీఆర్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

రాజేందర్ అదేపనిగా కేటీఆర్, టిఆర్ఎస్, కెసిఆర్ పైన విమర్శలు చేస్తున్నా, కేటీఆర్ మాత్రం స్పందించడం లేదు.చాలా సైలెంట్ అయిపోయారు.

పెద్దగా పార్టీ,  ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.ఒకవేళ హాజరైనా, ఎక్కడ రాజకీయ అంశాల గురించి , రాజేందర్ వ్యవహారాల గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు.

అంతేకాదు గతంలో అనేక శాఖల పనితీరుపై అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు.

కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు హరీష్చూస్తున్నారు.

  ఈటెల రాజేందర్ వ్యవహారంలోనూ హరీష్ రావు ను ముందుపెట్టి కేసీఆర్ రాజకీయం నడిపిస్తున్నారు.అయితే కేటీఆర్ ను ఎందుకు పక్కన పెట్టారు అని దానిపైన అందరికీ అనేక అనుమానాలు ఉన్నాయి.

  రాజేందర్ ఆషామాషీ వ్యక్తి కాదు.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి.

  పార్టీలో అంతర్గత వ్యవహారాలు బాగా తెలిసిన వ్యక్తి.  అదీ కాకుండా కేటీఆర్ కంటే ముందు నుంచి టిఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉన్న నాయకుడు.

  దీంతో రాజేందర్ కేటీఆర్ మధ్య విమర్శలు మొదలైతే అందులో రాజేందర్ పైచేయి అవుతుందని , దీనికితోడు తెలంగాణ ఉద్యమకారుల నుంచి కేటీఆర్ పై విమర్శలు వ్యక్తమవుతాయి అని, అసలు ఉద్యమంలో పాల్గొనని కేటీఆర్ కు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటనే విషయం చర్చకు వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్ ను ఈ విషయంలో పక్కకు తప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Telugu Etela Rajender, Etela Kcr, Hareesh Rao, Telangana, Trs-Telugu Political N

చాలా తెలివిగా కేసిఆర్ హరీష్ రావు కు బాధ్యతలు అప్పగించి రాజేందర్ హరీష్ మధ్య ఉన్న స్నేహం కొనసాగకుండా, కత్తెర వేసే విధంగా కెసిఆర్ చక్రం తిప్పినట్లు గా కనిపిస్తున్నారు.అసలు పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా హరీష్ విషయంలో వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం దీనిలో భాగమేనని, రాజేందర్ వ్యవహారం పూర్తిగా సద్దుమణిగిన తరువాత కేటీఆర్ ను మళ్లీ ఫామ్ లోకి  తీసుకువస్తారు అనే చర్చ ఇప్పుడు పార్టీలో నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube