వైరల్: తన మెడను ఏకంగా ప్రకటన హోర్డింగ్స్ గా మార్చేసిన ఘనుడు..!

ఒకప్పుడు అందరూ ఎంతో ఇష్టపడే పచ్చబొట్టు.నేటి రోజుల్లో టాటూగా దర్శనమిస్తోంది.

 Viral  The Man Who Turned His Neck Into A Single Advertising Hoardings, Tattoos,-TeluguStop.com

ముఖ్యంగా యువత టాటూలు వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు.శరీరంపై వివిధ రకాల డిజైన్లు, పేర్లు పొడిపించుకుంటున్నారు.

తాజాగా ఓ వ్యక్తి తన మెడపై టాటూ వేయించుకున్నాడు.కొన్ని సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన ఐడీలను ఆ వ్యక్తి టాటూగా వేయించుకోవడం విశేషం.

ఇలా టాటూ వేసుకోవడం ద్వారా ఆ వ్యక్తి డబ్బులను సంపాదిస్తున్నారు.చాలా మంది ప్రకటనలు చేయడానికి టీవీ షోస్ లను ఎంచుకుంటారు.

ఇంకొందరు పెద్ద పెద్ద బేనర్లను, హోర్టింగులకు ఏర్పాటు చేసి ప్రకటనలు చేస్తారు.పట్టణాలు, పల్లెటూర్లలో అయితే తమ సంస్థ యొక్క ప్రకటనలు చేయడానికి పాంప్లెట్స్ పంచుతారు.

ఇలా చేయడం ద్వారా ప్రజలకు ఆ సంస్థ గురించి త్వరగా తెలిసి వ్యాపారాన్ని లాభసాటిగా పెంచుకోవచ్చు.

Telugu Flash, Neck, Tattoos, Latest-Latest News - Telugu

ప్రస్తుతం కొందరు వ్యక్తులు డబ్బులు సంపాదించే పనిలో పడి ఇలాంటి ఐడియాలు వాడుతున్నారు.తాము ఫేమస్ అవ్వడం కోసం మొదటగా వారు టాటూలను వేసుకుని పబ్లిసిటీ చేసుకుంటారు.ఆ తర్వాత వారు ఆ సంస్థ ద్వారా కొంత డబ్బును ఆర్జిస్తారు.

ఇది ఇప్పటి కాలంలో ఓ కొంగొత్త ఐడియాగా విరాజిల్లుతోంది.చాలా మంది నిరుద్యోగులు ఇలాంటి ప్లాన్లు వేసి డబ్బులు పొందడం విశేషం.

రష్యాలోని ఎగొర్ ఒనొప్కో ఇలాంటి కార్యక్రమం చేసి ఫేమస్ అయ్యాడు.ఆయన తన మెడపై ప్రకటనలు చేశాడు.

ప్రచారం చేయాలనుకునే కొన్ని కంపెనీల పేర్లు, వ్యక్తుల ఐడీలను ఆయన తన మెడపై టాటూగా వేయించుకుని పబ్లిసిటీ చేస్తున్నాడు.దీనివల్ల వారు ఆయనకు కొంత డబ్బును ఇస్తారు.

వ్లాదివోస్టోక్‌లో నివాసం ఉండే ఎగొర్‌ ‘ఒనోకొండా’ పేరుతో బ్లాగర్‌గా ఫేమస్ అయ్యాడు.ఈయన ఒక్క ఐడీని టాటూగా వేసుకోవడం వల్ల ఆయనకు 1,350 యూఎస్‌ డాలర్లు అంటే దాదాపు రూ.98వేలు ఫీజుగా అందుతోంది.ఇలా ఇప్పటి వరకూ ఆయన రూ.9.8లక్షలు టాటూలు వేసుకోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube