అమెరికా: మూడు రాష్ట్రాల్లో తుపాకీ గర్జనలు, నలుగురు మృతి.. భారీగా క్షతగాత్రులు

అగ్ర‌రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.శుక్ర‌వారం అర్థ‌రాత్రి నుంచి శ‌నివారం తెల్ల‌వారుజామున మ‌ధ్య‌లో మూడు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో నలుగురు మరణించగా, మ‌రో 30 మంది గాయ‌ప‌డ్డారు.

 Overnight Mass Shootings In Us Leave 4 Dead, 30 Wounded, Mass Shooting, Us, Amer-TeluguStop.com

టెక్సాస్ రాజ‌ధాని అస్టిన్‌తో పాటు చికాగో, జార్జీయాలోని సవన్నాలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

Telugu Wounded, America, Austin, Covid Lockdown, Georgia, Gun, Mass, Mass Leave-

ఆస్టిన్‌లో బార్లు, రెస్టారెంట్‌లతో రద్దీగా వుండే వీధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 14 మంది గాయపడ్డారు.రెండు వర్గాల మధ్య వివాదం కారణంగా కాల్పులు చోటు చేసుకున్నట్లు ఆస్టిన్ తాత్కాలిక పోలీస్ చీఫ్ మీడియాకు తెలిపారు.ఘటనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు<.

/br>

చికాగో విషయానికి వస్తే.నగర దక్షిణ ప్రాంతంలోని చాతం నైబర్‌హుడ్ ఏరియాలో ఫుట్‌పాత్‌పై వున్న గుంపును లక్ష్యంగా చేసుకుని ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా తొమ్మిది మంది గాయపడ్డారు.కాల్పుల తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

ఇక దక్షిణ జార్జియా నగరమైన సవన్నాలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లుగా పోలీసులు తెలిపారు.క్షతగాత్రుల్లో ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.

ఈ ఘటనపై సవన్నా పోలీస్ చీఫ్ రాయ్ మిన్టర్ మాట్లాడుతూ.రెండు గ్రూపుల మధ్య వివాదం కారణంగానే కాల్పులు చోటు చేసుకున్నట్లుగా చెప్పారు.

Telugu Wounded, America, Austin, Covid Lockdown, Georgia, Gun, Mass, Mass Leave-

కోవిడ్ 19 ఆంక్షలు సడలించడం వల్ల సామాజికంగా ఎక్కువ మంది ఒక చోటికి చేరుతున్నారు.ఈ క్రమంలోనే గడిచిన కొన్నిరోజులుగా అమెరికాలో కాల్పులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.2020లో కోవిడ్ కారణంగా దేశంలో ఈ తరహా ఘటనలు క్షీణించాయి.అసోసియేటెడ్ ప్రెస్, యూఎస్ఏ టుడే, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.2020లో జరిగిన 17 సామూహిక కాల్పులు ఒక దశాబ్దంలోనే అతి తక్కువ.నేరస్తుడితో సహా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది చనిపోయిన ఘటనలను సామూహిక హత్యలుగా ఈ అధ్యయనం నిర్వచించింది.

కాగా, ఈ ఏడాది తొలి ఐదు నెలల కాలంలో తుపాకీ కాల్పుల కారణంగా అమెరికాలో 8,700 మంది మరణించినట్లు డేటా బేస్ చెబుతోంది.

కాగా, కొద్దిరోజుల క్రితం కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌జోస్‌లోని శాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీకి చెందిన మెయింటెనెన్స్ యార్డ్‌లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోయారు.

వీరిలో భారత సంతతికి చెందిన తేజ్‌దీప్ సింగ్ కూడా వున్నారు.సహచరులను కాపాడే యత్నంలో ఆయన ప్రాణాలు పొగొట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube