భారత్‌లో అడుగుపెట్టనున్న అమెరికా దిగ్గజ సంస్ధ.. ఇక సెమీ కండక్టర్లకు హబ్‌గా ఇండియా..?

చౌకైన మానవ వనరులు, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ కావడం, ప్రభుత్వ తోడ్పాటు వంటి అంశాల కారణంగా ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలు భారత్‌లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.ప్రపంచ ఉత్పాదక రంగానికి కేరాఫ్‌గా వున్న చైనాపై కోవిడ్ తర్వాత నుంచి నమ్మకాలు దెబ్బతినడంతో అనేక సంస్థలు భారత్‌వైపు చూస్తున్నాయి.

 Us Semiconductor Maker Applied Materials In Talks With Indian Govt, , Us Semicon-TeluguStop.com

ఇదే సమయంలో కరోనా సంక్షోభం దాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు కుదేలైనా.భారత్ మాత్రం తట్టుకోగలిగింది.

ఇది కూడా బడా కంపెనీలను ఆలోచింపజేస్తోంది.
తాజాగా అమెరికా దిగ్గజ కంపెనీ అప్లైడ్‌ మెటీరియల్స్ భారత్‌లో పరిశ్రమను నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల మార్కెట్‌లో అగ్రశ్రేణి కంపెనీగా పేరొందిన అప్లైడ్ మెటీరియల్స్… వివిధ పరికరాలు, సేవలు, సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంటుంది.

ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే కొన్ని కీలక పరికరాలు, విడి భాగాల తయారీ ప్లాంట్‌ను భారత్‌లో నెలకొల్పాలని భావిస్తున్నట్లు సమాచారం.

Telugu Indian, Semi Hub India, Semimaker, Makerapplied-Telugu NRI

17.2 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన అప్లైడ్‌ మెటీరియల్స్ భారత్‌లోకి ప్రవేశిస్తే.సెమీకండర్ల పరిశ్రమకు ఇండియా కేంద్రంగా మారుతుందని అంచనా.

ఇప్పటికే సెమీకండక్లర్ల రంగంలోని అపార అవకాశాల దృష్ట్యా కేంద్రం సైతం ప్రణాళికలను రూపొందిస్తోంది.సెమీకండక్టర్‌ సహా ఇతర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

అలాగే ఇండియాలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ‘ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈఓఐ)’ను కూడా విడుదల చేసింది.అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ కంపెనీలు కూడా ఇందులో పాల్గొనాలని సూచించింది.

అలాగే పరిశ్రమ ఏర్పాటుకు ఎలాంటి సహకారం కావాలో కూడా తెలియజేయాలని కోరింది.

Telugu Indian, Semi Hub India, Semimaker, Makerapplied-Telugu NRI

ఈ వ్యూహాలకు అప్లైడ్ మెటీరియల్స్ రాక మరింత ఊతాన్ని ఇస్తుందని కార్పోరేట్ వర్గాలు భావిస్తున్నాయి.అలాగే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అప్లైడ్ మెటీరియల్స్ సప్లై చైన్‌లో భారత్‌ కూడా భాగమవుతుంది.అయితే, ఈ సంస్థ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ కింద భారత్‌లోకి ప్రవేశిస్తుందా.? లేక స్వతంత్రంగానే రానుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
1967లో మైఖేల్ ఎ మెక్‌నీల్ తదితరులు అప్లైడ్ మెటీరియల్స్‌ను స్థాపించారు.1972లో ఈ సంస్థ పబ్లిక్ ఈష్యూకి వచ్చింది.1978 నాటికి అమ్మకాలు 17 శాతం పెరిగాయి.అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ సంస్థ.1984లో జపాన్‌లో తన సొంత సాంకేతిక కేంద్రాన్ని ప్రారంభించించింది.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికన్ సెమీకండెక్టర్ పరికరాల తయారీదారుగా అవతరించింది.తదనంతర కాలంలో ఎన్నో కంపెనీలను టేకోవర్ చేస్తూ ముందుకు సాగుతోంది.21 వేల మంది ఉద్యోగులు, 17.25 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో అప్లైడ్ మెటీరియల్స్.2018లో ‘‘ FORTUNE World’s Most Admired Companies’’లో ఒకటిగా స్థానం సంపాదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube