వైరల్: ఆ చెట్టు బెరడును నరికితే రక్తం వస్తోందట..?!

భూ ప్రపంచంలో మానవులకు తెలియని ఎన్నో రహస్యాలు దాగున్నాయి.ప్రకృతి కి సంబంధించి ఇప్పటివరకు మానవులు కేవలం కొద్ది శాతం మాత్రమే కనుగొన్నారు.ఇంకా కనిపెట్టాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.అయితే కాలక్రమేణా మానవులు ప్రకృతిలో దాగున్న అనేక రహస్యాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు.ఆ రహస్యాలు యావత్ ప్రపంచాన్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.బహుళ వర్ణాలతో ఎంతో చూడముచ్చటగా కనిపించే ఇంద్రధనస్సు యూకలిప్టస్ చెట్టు.

 Viral Very Interesting Facts About The Dragon Blood Tree , Dragons, Blood, Trees-TeluguStop.com

చేతివేళ్ల లాంటి విచిత్రమైన ఎర్ర పువ్వులుగల డెవిల్స్ హ్యాండ్ ట్రీ. వంటి చెట్లను కనిపెట్టారు కానీ ఈ ప్రపంచంలో ఇంకా కనిపెట్టని ఎన్నో వైవిధ్యమైన చెట్లు ఉన్నాయి.

అయితే ఇప్పటి వరకు కనిపెట్టిన అన్ని వైవిధ్యమైన చెట్లలో మొదటి ప్లేస్ లో `డ్రాగన్ బ్లడ్ ట్రీ` నిలుస్తోంది.మరి ఆ చెట్టు విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందామా…

`డ్రాగన్ బ్లడ్ ట్రీ` చెట్లు యెమన్‌లోని సాకోత్రా ద్వీపసమూహంలో మాత్రమే కనిపిస్తాయి.

చూసేందుకు తెరిచిన ఒక గొడుగు లా కనిపించే ఈ చెట్లు 100 కాదు, 200 కాదు.ఏకంగా 650 సంవత్సరాలపాటు జీవించగలవు.ఈ భూగ్రహం పై 5000 ఏళ్ల పాటు జీవించగల చెట్లు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.650 సంవత్సరాల పాటు జీవించగల ఈ చెట్లు 33 నుంచి 39 అడుగుల వరకు ఎత్తు పెరగగలవు.అయితే ఈ చెట్లు అధికంగా వేడి, తేమ ఉన్న వాతావరణంలోనే పెరగగలవు.

అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే.

చెట్టు బెరడును నరికితే అచ్చం రక్తం లా కనిపించే ఒక ద్రవం వరదలా పారుతుంది.

Telugu Tree, Dragon Tree, Increasessexual, Rod Waddington, Trees, Rare Tree, Lat

ఈ చెట్టులో ఎర్ర రంగు రెసిన్లు అధికంగా ఉండటం వల్ల.బెరడు నరక గానే ద్రవం బయటకు వస్తుంది.అయితే ఈ చెట్టులో బాగా రసం ఉండటం వల్ల కరువు వచ్చినప్పుడు కూడా ఇది సజీవంగానే ఉండగలుగుతుంది.

అయితే ఈ ఎరుపు ద్రవాన్ని స్థానిక ప్రజలు డ్రాగన్ బ్లడ్ గా భావిస్తారు.అందుకే ఈ విచిత్రమైన చెట్టుకి “డ్రాగన్ బ్లడ్ ట్రీ” అనే పేరు వచ్చింది.

ఐతే ఈ ద్రవం ఒక దివ్యౌషధమని భావించి దానిని జ్వరం, అల్సర్, నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోవడానికి వాడుతారు.

Telugu Tree, Dragon Tree, Increasessexual, Rod Waddington, Trees, Rare Tree, Lat

అలాగే లైంగిక శక్తి పెరగడానికి ఈ ద్రవం విరివిగా వాడతారు.

ఈ వింత చెట్లు పెరిగే ప్రాంతాన్ని యునెస్కో (UNESCO) 2008వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.అయితే ఈ ప్రదేశంలో నీటి కొరత ఏర్పడకపోవడానికి డ్రాగన్ బ్లడ్ చెట్లే కారణమని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube