హిందువుల మనోభావాలు దెబ్బతీసిన స్టార్ హీరోయిన్.. సినిమాలు బ్యాన్ చెయ్యాలంటూ?

ఎంత స్టార్ హీరోయిన్ అయిన సినిమా విషయంలో ఎన్నో ఆలోచనలు చేయాలి.తాను నటించే పాత్ర గురించి సరైన నిర్ణయం తీసుకోవాలి.

 Netizens Demand Boycott Of Kareena Kapoor Khan, Kareena Kapoor Khan, Bboycott Ka-TeluguStop.com

పాత్ర ప్రాముఖ్యత తెలుసుకొని పాత్రకు తగ్గట్టుగా నడుచుకోవాలి.లేదంటే సమాజం నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇప్పటికే ఎన్నో సినిమాలలో తమ మతాల పరంగా మనోభావాలు దెబ్బ తీసిన సినిమాలు ఉండగా వాటి వల్ల ఎన్నో వివాదాలు ఎదురయ్యాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు సినిమాను బ్యాన్ చేయాలని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.ప్రస్తుతం కరీనా అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో సీత అనే సినిమాలో నటిస్తుంది.ఇందులో టైటిల్ పాత్రను పోషించనున్న కరీనా ఇటీవలే ఈ పాత్ర కోసం సుమారు 12 కోట్ల వరకు పారితోషకం ను డిమాండ్ చేసింది.ఇక అప్పటి నుంచి ఈ విషయం వార్తలలో బాగా వైరల్ గా మారింది.

మామూలుగా తను ఒక్క సినిమాకు 6 నుండి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

Telugu Bollywood, Hindus, Kareenakapoor, Kareena Kapoor, Karina Kapoor, Netizens

కానీ ఈ సినిమాలో సీత పాత్ర కోసం దాదాపు 10 నెలల సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఇంత పారితోషకం ను డిమాండ్ చేసిందట.ప్రస్తుతం ఈ విషయం గురించి బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా చర్చలు మొదలయ్యాయి.దీంతో కరీనా సీత పాత్ర కోసం అంత రెమ్యూనరేషన్ తీసుకోవడంలో నెటిజనులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా బై కాట్ కరీనా ఖాన్ అంటూ హాష్ ట్యాగ్ లు కూడా చేస్తున్నారు.

Telugu Bollywood, Hindus, Kareenakapoor, Kareena Kapoor, Karina Kapoor, Netizens

హిందువుల మనోభావాలు కరీనా దెబ్బతీసిందని సీత పాత్రకు కరీనా కంటే కంగనా రనౌత్ బెటర్ అని చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి.పైగా కరీనాకు శూర్పణక పాత్ర కరెక్ట్ సరిపోతుందని ట్రోలింగ్, కామెంట్స్ కూడా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారడంతో కరీనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube