40 ఏళ్ళ స్నేహం.. ఫోన్ ఎత్తకపోతే తట్టుకోలేకపోయాను: బాబు మోహన్

తెలుగు సిని నటుడు బాబు మోహన్.ఎన్నో సినిమాలలో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు.

 Babu Mohan 40 Year Old Friend Could Not Bear Not Picking Up The Phone,  Babu Moh-TeluguStop.com

ఇక రాజకీయాలలో కూడా బాధ్యత వహిస్తున్నాడు.తొలిసారి తెలుగుదేశం పార్టీలో బాధ్యతలు నిర్వహించగా ఆ తర్వాత పార్టీలు మారవలసి వచ్చింది.ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కేసీఆర్ వద్ద జరిగిన అవమానం గురించి పంచుకున్నాడు.

1987లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన బాబు మోహన్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ సొంతంగా ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.అంకుశం, మామగారు వంటి సినిమాలలో తన నటనకు మంచి గుర్తింపు అందుకున్నాడు ఇక అదే సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.మొదటిసారిగా మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఇక మళ్లీ తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఓడిపోయాడు.

ఇక ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు.

ఇక అక్కడ జరిగిన కొన్ని అవమానాలు గురించి పంచుకున్నాడు.తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని తెలిపాడు.

ఆందోల్ టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడట.ఇక 2018 ఎన్నికల సమయంలో తనను పక్కన పెట్టినట్లు తెలిపాడు.

ఇక ఆయన అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించిన దొరకలేదు అని తెలిపాడు.

Telugu Friend, Mohan Babu, Tollywood-Movie

దాదాపు 50 సార్లు ఫోన్ చేసినా కూడా అయినా పట్టించుకోలేదని, దాదాపు 40 ఏళ్ల స్నేహాన్ని కూడా అక్కల పెట్టారట.పైగా అపాయింట్మెంట్ కోసం వారం రోజుల పాటు ఎదురు చూశాడట.ప్రతి రోజు ఫోన్ చేసి ఎత్తక పోయేసరికి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడట.

ఇంకా అవన్నీ తట్టుకోలేక టిఆర్ఎస్ నుండి వెళ్ళిపోయి బీజేపీలో చేరడం.ఇక కేసీఆర్ కు రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తిగా ఎన్నో లెక్కలు ఉండవచ్చు కానీ తమ స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఒక్కసారైనా తనతో మాట్లాడి అసలు విషయం చెప్పి ఉంటే బాగుండేది అని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube