భారత కార్మికులకు వరంగా మారనున్న కువైట్ కొత్త చట్టం...!!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో అత్యధికంగా వలసలు వెళ్ళే దేశాలలో కువైట్ కూడా ఒకటి అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వలసలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా అరబ్ దేశాలకు కూడా వలసలు ఉంటాయి.ముఖ్యంగా ఇక్కడకు వలసలు వెళ్ళే వారిలో అత్యధికంగా కార్మికులుగా వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

 India Kuwait Sign Mou For Legal Protection For Domestic Workers , India, Kuwait-TeluguStop.com

మరీ ముఖ్యంగా భారత్ నుంచీ కువైట్ వంటి దేశాలకు వలసలు వెళ్ళే వారు అత్యధికులు.భారత్ లోని ఏపీ, కేరళా రాష్ట్రాల నుంచీ ఈ వలసలు ఎక్కువగా ఉంటాయి.

అయితే కువైట్ లో పనిచేసే వలస కార్మికులకు ఉద్యోగ రక్షణ ఉండదు, దాంతో ఎంతో మంది భారతీయ వలస కూలీలు కువైట్ వెళ్లి అక్కడి యజమానుల కారణంగా నష్టపోతున్నారు.ఉద్యోగంలో తీసుకున్న తరువాత అకారణంగా మానేయమంటే ఆ పని నుంచీ తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.

అంతేకాదు అక్కడి స్థానికులకు చట్టపరంగా ఎలాంటి భద్రత పొందుతారో ఇకపై భారత్ నుంచీ వెళ్ళే వలస కార్మికులు సైతం అలంటి రక్షణ పొందుతారని ప్రభుత్వం తెలిపింది.

ఈ మేరకు భారత ప్రభుత్వం, కువైట్ ప్రభుత్వం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి .కువైట్ దేశంలో ఉన్న భారతీయ కార్మికులను న్యాయ పరిధిలోకి తీసుకు వచ్చే విధంగా భారత రాయబారి జార్జ్, కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రి అహ్మద్ అల్ అంగీకర నిభంధనల పత్రాలపై సంతకాలు చేశారు.ఈ పరిణామాలతో కువైట్ లో ఉండే భారతీయ కార్మికులకు చట్టపరమైన రక్షణ వస్తుందని అంతేకాకుండా 24 నాలుగు గంటల పాటు కువైట్ ప్రజలకు అందించే రక్షణ సైతం భారత వలస కార్మికులు పొందుతారని కువైట్ లోని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube