ఆరేళ్ల కిందట అదృశ్యం అయిన మహిళను క్షేమంగా ఇంటికి చేర్చిన గూగుల్.. ఎలాగంటే..?!

ప్రస్తుతం ఉన్న సమాజంలో గూడు లేకుండా ఉంటారేమోగానీ గూగుల్ లేకుండా ఉండలేరు.గూగుల్ అందరికీ చాలా రకాలుగా ఉపయోగపడుతోంది.

 Google Has Added A Woman Who Went Missing Six Years Ago Safely Home .. Somehow .-TeluguStop.com

ఇకపోతే ఎక్కడికైనా వెళ్లాలన్నా, లేకుంటే ఏదైనా తెలుసుకోవాలన్నా గూగుల్ ఇట్టే చెప్పేస్తుంది.తాజాగా ఓ యువతిని గూగుల్ తన ఇంటికి చేరేలా చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఓ యువతి కనిపించకుండా పోయింది.ఆ యువతి కనిపించకుండా పోయి 6 సంవత్సరాలు అవుతోంది.

అయితే ఆ యువతికీ తన ఇల్లు 6 సంవత్సరాల తర్వాత దొరికింది.కురుపాం గ్రామంలో ఓ సెల్ పాయింట్ యజమాని ఆమెకు సహకరించాడు.

పువ్వల జయసుధ అనే యువతి గూగుల్ సాయంతో తన ఇంటికి చేరింది.

ఓ ఆశ్రమాన్ని నిర్వహించే వారు గూగుల్ లో కురుపాం గ్రామంలో సెల్ పాయింట్ అడ్రస్ లో ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేశారు.

ఫస్ట్ తమిళ్ లో మాటలు వినిపించడంతో ఎవరోలే అనుకున్నారు.ఆ తర్వాత యువతి ఊరు పేరు, తల్లిదండ్రుల పేరు ఇంగ్లీష్ లో చెప్పింది.

ఆ యువకుడు అందులో కొంత అర్థం చేసుకున్నాడు.యానాంలో ఉన్న తమిళ భాష తెలిసిన తన ఫ్రెండ్ తో ఆశ్రమాన్ని సంప్రదించమని చెప్పారు.ఆ తర్వాత తన స్నేహితుడి ద్వారా ఆ యువతి అన్ని వివరాలు చెప్పింది.2016 లో నుంచి ఆమె ఇక్కడ ఉన్నట్లు తెలిపింది.దీంతో వెంటనే ఎల్విన్ పేట పోలీసులను, పోలీసుల ద్వారా యువతి తల్లిదండ్రులను సంప్రదించామని తెలిపాడు.ఆ తర్వాత యువతితో ఆశ్రమ నిర్వాహకులు తమ తల్లిదండ్రులతో మాట్లాడించారు.వీడియో కాల్ చేసి వారి ఇరువురితో మాట్లాడించిన తర్వాత అందరూ హ్యాపీ గా ఉన్నారు.ఆరు సంవత్సరాల తర్వాత కూతురు ఇంటికి రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా గూగుల్ కు, సెల్ ఫోన్ షాప్ యజమాని కి వారు ధన్యవాదాలు తెలిపారు.యువతి తమ తల్లిదండ్రులను కలుసుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube