వ‌ర్షాకాలంలో నిర్జీవంగా మారిన చ‌ర్మానికి..ఇలా స్వ‌స్తి చెప్పండి!

వ‌ర్షాకాలం మొద‌లైంది.ఈ సీజ‌న్‌లో అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లతో పాటు ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

 Skin Care Tips In Rainy Season! Skin Care Tips, Rainy Season, Skin Care, Face Pa-TeluguStop.com

ముఖ్యంగా చాలా మంది చ‌ర్మం నిర్జీవంగా మారిపోతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క.

చ‌ర్మాన్ని ఎలా కాంతివంతంగా మార్చుకోవాలో అర్థంగాక‌.తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

అలాంట‌ప్పుడు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.సుల‌భంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు య‌వ్వ‌నంగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

వ‌ర్షాకాలంలో నిర్జీవంగా మారిన చ‌ర్మానికి పుచ్చ‌కాయ స్వ‌స్తి ప‌ల‌క‌వ‌చ్చు.

అందు కోసం ముందుగా పుచ్చ‌కాయ నుంచి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఆ ర‌సంలో కొద్దిగా పాల పొడి వేసి.

బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే.

చ‌ర్మం గ్లోగా మారుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని.

అందులో కోకో పౌడ‌ర్, పంచ‌దార మ‌రియు తేనె వేసుకుని క‌లుపుకోవాలి.

Telugu Tips, Cocoa Powder, Dull Skin, Face Care, Face, Skin, Honey, Latest, Milk

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తూ ఉంటే.నిర్జీవంగా మారిన చ‌ర్మం మ‌ళ్లీ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది.

ఇక ఈ టిప్స్‌తో పాటు వ‌ర్షాకాలంలో చ‌ర్మాన్ని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి.మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోవాలి.

చ‌ల్ల‌గా ఉంది క‌దా అని వాట‌ర్ త‌క్కువ‌గా తీసుకుంటారు.కానీ, చ‌ల్ల‌గా ఉన్నా, వేడిగా ఉన్నా శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందిస్తేనే.

చ‌ర్మం నిర్జీవంగా మార‌కుండా ఉంటుంది.అలాగే డైట్‌లో తాజా పండ్లు, ఆకుకూర‌లు, కాయ‌కూర‌లు తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube