హైదరాబాద్ బయోఫోర్ నుండి కరోనాకి మరో ఔషధం.. డీజీసీఐకి దరఖాస్తు..!

కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు మరో కొత్త ఔషధాన్ని కనిపెట్టారు హైదరాబాద్ కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్.కరోనా ట్రీట్మెంట్ లో ఈ సంస్థ అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది.

 Another Emergency Medicine Aviptadil From Biophore Drug Controller, Another Emer-TeluguStop.com

ఈ ఔషధ వినియోగ అనుమతుల కోసం భారత ఔషధ నియత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది.బయోఫోర్ అభివృద్ధి చేసిన వాసోయాక్టివ్ ఇంటెస్టినల్ పెప్డైడ్ (వీఐపీ) అయిన అవిప్టాడిల్ కరోనా బాధిఉలకు త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి నిర్వహించిన క్లినీల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని సంస్థ సీ.ఈ.ఓ డాక్టర్ జగదీష్ బాబు చెప్పారు.ఇదే కంపెనీ నుండి ఇదివరకు ఫావిపిరావిర్ ఔషధాన్ని అందించారు.

ఇక ఇప్పుడు అవిప్టాడిల్ అనే ఔషధాన్ని ఏర్పాటు చేశారు.కరోనా బాధితులకు ఇది సమర్ధవంతంగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.

అయితే జరగాల్సిన క్లినికల్ ట్రయల్స్ అన్ని పూర్తయితే తప్పకుండా ఈ ఔషధానికి కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే కరోనా కోసం చాలా రకాల మందులు ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నాయి.

వాటితో పాటుగా ఈ ఔషధం కూడా త్వరలో అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube