కరోనాతో ఇంటి పెద్దని కోల్పోయిన ఎస్సీ కుటుంబాలకు అండగా కేంద్రం..!

కరోనా కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.ఇంట్లో సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు.

 Sc Families Who Lost Family Head Nsfdc Issue Loans,latest-TeluguStop.com

అయితే ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇలాంటి వారికి 20 శాతం సబ్సీడీతో 5 లక్షల వరకు రుణం ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది.

ఎస్సీ ఆర్ధికాభివృద్ధి సంస్థ ద్వారా వీరికి రుణం అందనుంది.అంతేకాదు అందుకున్న రుణంలో 20 శాతం రాయితీ పోను మిగతా మొత్తాన్ని 6 శాతం వడ్డీతో వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది.

ఇందుకు కొన్ని నిబంధనలు కూడా కేంద్రం విధించింది.

Telugu Corona, Loans, Nsfdc, Nsfdc Loans, Sc-General-Telugu

కరోనా మరణించిన వ్యక్తి వయసు 18 నుండి 60 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది.కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల మించి ఉండకూడదు.కుటుంబంలో తల్లిదండ్రులు మరణించినా, సంపాదించే వ్యక్తి మరణించినా ఈ ఆర్ధిక సాయం లభిస్తుంది.

కుటుంబ పెద్ద కొవిడ్ తో మరణించినట్టు ధ్రువీకరణ పత్రం చూపించాలి.కుటుంబం మొత్తం అతడి సంపాదన మీద ఆధారపడి ఉండాలి.

ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను గుర్తించి ఆ జాబితా పంపించాలని ఎన్.ఎస్.ఎఫ్.డి.సీ రాష్ట ప్రభుత్వాలను కోరింది.ఈ మేరకు శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ వారు ఆదేశాలు జారీ చేశారు.

జాబితా రెడీ చేసి బాధితులకు సాయం అందేలా చూస్తామని వారు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube