కరోనాను ఓడించడానికి చిరంజీవి చెప్పిన నియమాలివే..?

మన దేశంలో ప్రతిరోజూ లక్షకు అటూఇటుగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.వైరస్ బారిన పడిన వాళ్లలో ఎక్కువమంది కోలుకుంటున్నప్పటికీ కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

 Megastar Chiranjeevi Says Corona Guidelines And Acted In Ad With Cute Kids,lates-TeluguStop.com

సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ ను ఓడించడానికి చిన్నపిల్లలతో కలిసి వీడియో చేశారు.

మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కరోనా సోకినా, కరోనా రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నా కొన్ని నియమాలు పాటిస్తే కరోనాపై పోరాడటంతో పాటు కరోనాను సులభంగా ఓడించగలమని చిరంజీవి చెప్పుకొచ్చారు.కనీసం పది రోజుల పాటు అందరికీ దూరంగా, ధైర్యంగా ఉండాలని సొంత వైద్యం మంచిది కాదని డాక్టర్ల సలహాలు తీసుకుని వైద్యం చేయించుకుంటే మంచిదని వీడియోలో పిల్లలతో చెప్పించారు.

క్రమం తప్పకుండా చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే జాగ్రత్తలు తీసుకుంటూనే మీరు కూడా ముక్కు నుంచి మొహానికి మాస్క్ ధరించాలని జ్వరం తగ్గకపోతే శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే డాక్టర్ ను సంప్రదించాలని వీడియోలో పేర్కొన్నారు.ప్రజలలో మనోధైర్యం నింపాలనే ఉద్దేశంతో చిరంజీవి ఈ వీడియోను చేయడం గమనార్హం.

మరోవైపు చిరంజీవి వరుస సినిమాలకు కమిటైనప్పటికీ ఆచార్య షూటింగ్ పూర్తైన తరువాతే చిరంజీవి కొత్త సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉంటాయి.వేదాళం, లూసిఫర్ రీమేక్ లతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మొదట లూసిఫర్ రీమేక్ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది మిగతా సినిమాల షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.రాజకీయాల వల్ల గ్యాప్ రావడంతో చిరంజీవి ప్రస్తుతం వేగంగా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube