సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న ఆ యూనివర్సిటీ నిర్వాకం.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

నేటి సమాజంలో ఇంకా కొన్ని చోట్ల ఆడవారిపట్ల చిన్నచూపు ఉంది.మహిళలను బాధపెట్టడం, వారిని వేధింపులకు గురిచేయడం, ఇంట్లో నరకం చూపించడం అనేవి నేడు ఎక్కడో ఓ మూల జరుగుతున్న ఘటనలే.

 The University Administration Is Being Criticized Everywhere .. What Is The Real-TeluguStop.com

అయితే మహిళలు కూడా వారిని ఎదుర్కొంటున్నారు.తమకు జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమకు ఎదురయ్యే ముళ్ల దారులను పూల దారులుగా చేసుకుంటున్నారు.

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చైనాలోని నాంజింగ్ విశ్వవిద్యాలయంలో మహిళలకు అవమానం జరిగింది.మహిళలను ఆ యూనివర్సిటీలో తక్కువ చేసి చూస్తున్నారు.

యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం చేసిన ప్రకటనలలో మహిళలను అవమానించారన్న కారణంతో నాంజింగ్ విశ్వవిద్యాలయంపై నెట్టింట్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఈ యూనివర్సిటీలో జరిగిన పలు ఘటనలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఇటువంటి నేపథ్యంలో పలువురు దీనిపై ఫైర్ అవుతున్నారు.

విశ్వివిద్యాలయానికి చెందిన 6 మంది స్టూడెంట్స్, తమ యూనివర్శిటీ సమీపంలో నిలబడి చేతుల్లో సైన్ బోర్డులు పట్టుకుని ఉన్నారు.

ఆ సైన్ బోర్డుల్లో రాసి ఉన్న అంశాలే వివాదాలకి దారి తీసాయి.నలుగురు పట్టుకున్న సైన్ బోర్డుల్లో వివాదాస్పద అంశాలేమీ కనపడలేదు.అయితే ఒక రెండు సైన్ బోర్డులు మాత్రం వివాదానికి దారితీస్తున్నాయి.ఆ సైన్ బోర్డులో ఏముందంటే ఒకానొక గర్ల్ స్టూడెంట్ పట్టుకున్న సైన్ బోర్డులో ఉదయం నుండి రాత్రి వరకు లైబ్రరీలో నాతో ఉండాలనుందా అన్న సందేశం ఉంది.

అలాగే మరో బోర్డులో నీ టీనేజ్ లో నన్ను కూడా కలుపుకోవాలని నువ్వు అనుకుంటున్నావా అన్న సందేశం ఉంది.ఈ రెండు సైన్ బోర్డులే వివాదాన్ని రేకెత్తించాయి.

అమ్మాయిల ఫోటోలు పెట్టి ఇలా అడ్వర్టైజ్ చేయడం హీనంగా ఉందని, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఇలాంటి ప్రకటనలు చేయడం బాగోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంకొందరేమో ఇది పెద్ద విషయం కాదని, ఇందులో పురుషులు, మహిళలు అన్న జండర్ పై అంశాలను తీసుకురావద్దంటున్నారు.

దీనిపై నాంజింగ్ యూనివర్సిటీని ప్రపంచ వ్యాప్తంగా పలువురు విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube