అనసూయ భర్తపై రోజా షాకింగ్ కామెంట్లు.. అలా చేస్తాడంటూ..?

బుల్లితెర షో జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ షోలో ఎన్నో మార్పులు వచ్చాయి.అయితే రోజా మాత్రం ఈ షోకు జడ్జిగా సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉన్నారు.

 Jabardasth Judge Roja Shocking Comments About Anasuya Husband, Jabardasth Judge-TeluguStop.com

జబర్దస్త్ షోకు రోజా రెమ్యునరేషన్ భారీగానే ఉంటుందని సమాచారం.తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో అనసూయ భర్తపై రోజా చేసిన కామెంట్లు, హైపర్ ఆది స్కిట్ లో వేసిన పంచ్ లు ప్రోమోకు హైలెట్ గా నిలవడం గమనార్హం.
ప్రొమోలో రామ్ ప్రసాద్, హైపర్ ఆది అందాల రాముడు సినిమాలోని రాజాధిరాజ వీరాధివీర పాటతో ఎంట్రీ ఇస్తారు.హైపర్ ఆది రామ్ ప్రసాద్ తో నేను నంబర్ 1 వెధవ వీడు నంబర్ 2 వెధవ అని చెప్పగా రామ్ ప్రసాద్ అదేంట్రా నన్ను పిలిచి అవమానిస్తావా.? నంబర్ 1 నాకు ఇవ్వు అని చెబుతాడు.శాంతిస్వరూప్ హైపర్ ఆది దగ్గరకు వచ్చి మొన్న ఒకడు నన్ను చూసి చెయ్యి కోసుకున్నాడు అని చెప్పగా దూరం నుంచి చూశాడు కాబట్టి చెయ్యి కోసుకున్నాడని దగ్గరనుంచి చూస్తే మాత్రం ఉప్పెనేనని చెబుతాడు.

రాకెట్ రాఘవ స్కిట్ లో భాగంగా వీడేంటి ఇంత ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నారా పెళ్లి కాని వాడు పెళ్లి కాని వాడు ఆనందంగా ఉన్నాడంటే పుట్టినరోజని అర్థమని పెళ్లైనవాడు ఆనందంగా ఉన్నాడంటే వాడు పుట్టింటికి వెళ్లాడని అర్థం చేసుకోవాలని రాకెట్ రాఘవ అన్నారు.ఈ వారం రోజులు మా ఇంట్లో సెలబ్రేషన్ అని రాఘవ చెప్పగా మా ఆయన ఈ స్కిట్ చూడకుండా ఆపాలి అని అనసూయ చెబుతుంది.

రోజా వెంటనే మీ ఆయన అదే చేస్తాడు నువ్వు షూటింగ్ కు వస్తే అని అనసూయకు రివర్స్ లో పంచ్ వేస్తుంది.చలాకీ చంటి, ఇమ్మాన్యుయేల్ ప్రోమోలో వేసిన పంచ్ లు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube