కన్నడలో తెరకెక్కుతున్న తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ బయోపిక్

ఈ మధ్యకాలంలో బయోపిక్ ల ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్ లో కనిపిస్తుంది.సౌత్ లో బయోపిక్ ప్రయత్నాలు చేస్తున్న అవి పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు.

 Rohini Sindhuri Biopic In Kannada, Tollywood, Sandalwood, South Cinema, Ias Offi-TeluguStop.com

బయోపిక్ అంటే ఒక వ్యక్తి జీవితంలో అన్ని అంశాలని కూడా తెరపై ఆవిష్కరించేలా ఉండాలి.అలాగే ఎమోషన్స్ ని తెరపై అద్బుతంగా ప్రెజెంట్ చేయాలి.

అలా కాకుండా ఫేమ్ ఉందనే కారణంతో బయోపిక్ లు చేస్తే మొదటికే మోసం వస్తుంది.ఈ విషయాన్ని ఎన్టీఆర్ బయోపిక్ ప్రూవ్ చేసింది.

ఎన్టీఆర్ జీవితంలో కీలక సంఘటనలని తెరపై చూపించకుండా సాదాసీదాగా ప్రెజెంట్ చేయడంతో రెండు భాగాలుగా వచ్చిన బయోపిక్ డిజాస్టర్ అయ్యింది.ఇదిలా ఉంటే కొంత మంది రియల్ లైఫ్ హీరోలుగా స్పూర్తినిచ్చే వ్యక్తులు ఉంటారు.

అలాంటి వారి కథని తెరపై ఆవిష్కరిస్తే ఎంతో మందికి ఆ కథ స్ఫూర్తి కలిగిస్తుంది.ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2009లో చిన్న వయస్సులో ఐఏఎస్ సాధించిన రోహిణీ సింధూరి బయోపిక్ ఇప్పుడు కన్నడ బాషలో తెరకెక్కుతుంది.నేషనల్ లెవల్లో 43వ అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఈమె కర్నాటక కేడర్ కు ఎంపికయ్యారు.

2011లో తమకూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా తొలిపోస్టింగ్ తీసుకున్నారు.ఈ పదేళ్ల కాలంలో పలుమార్లు ఉద్యోగోన్నతి సాధించారు.అదే సమయంలో ట్రాన్స్ ఫర్లు కూడా వచ్చాయి.ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న సింధూరి పనిచేసిన ప్రతిచోటా తన మార్కు చూపించడానికి ప్రయత్నించారు.ఈ క్రమంలోనే పలు వివాదాలు కూడా వచ్చాయి.

ఈ ప్రధానాంశాలతోనే కృష్ణస్వర్ణసంద్ర స్వీయ నిర్మాణంలో తెరకెక్కించబోతున్నారు.ప్రస్తుతం స్క్రిప్టు తుదిదశలో ఉందని త్వరలోనే సినిమా ప్రారంభించబోతున్నామని చెప్పారు.

విధి నిర్వహణలో ఓ అధికారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే కీ పాయింట్ ఆధారంగానే ఈ సినిమా రూపు దిద్దుకోనుందని చెప్పారు.ఈ చిత్రం కోసం భారత సిందూరి అనే టైటిల్ ను ఖరారు చేశారు.

లీడ్ రోల్ లో కన్నడ బిగ్ బాస్ కంటిస్టెంట్ పాండవపుర నటించబోతున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube