హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ త్రిముఖ వ్యూహం.. ఆ ఇద్దరే టార్గెట్‌?

ప్ర‌స్తుతం రాష్ట్ర‌మంతా హుజూరాబాద్ గురించే చ‌ర్చించుకుంటోంది.అక్క‌డ ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 Trs Three-pronged Strategy In Huzurabad Are Those Two The Target , Kcr, Etala R-TeluguStop.com

టీఆర్ ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న‌ట్టుగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి.కాగా ఈ రాజ‌కీయాల్లో ఎవ‌రు గెలుస్తార‌నేదే ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు టీఆర్ ఎస్‌కు, ఈట‌ల రాజేంద‌ర్‌కు కీ రోల్‌గా మార‌నున్నాయి.ఇక్క‌డ గ‌న‌క టీఆర్ ఎస్ ఓడిపోతే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేకత రావ‌డం ఖాయం.

అందుకే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు.తానే ద‌గ్గ‌రుండి వ్యూహ‌ర‌చ‌న అందిస్తున్నారు.అయితే హుజూరాబాద్‌లో త్రిముఖ వ్యూహాన్ని కేసీఆర్ అమ‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఈట‌ల ఓడిపోతే ఆయ‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌దు.

అప్పుడు కేసీఆర్‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా చెక్ ప‌డ్డ‌ట్టు అవుతుంది.అలాగే బీజేపీ ప్ర‌భావం మ‌రింత త‌గ్గే ఛాన్స్ ఉంటుంది.

ఇంకోవైపు రాష్ట్రంలో దూసుకుపోతున్న బండి సంజ‌య్ పార్ల‌మెంట్ ప‌రిధిలోనే హుజూరాబాద్ ఉంది కాబ‌ట్టి.అక్క‌డ ఓడిపోతే బండిసంజ‌య్‌కు బ్రేకులు ప‌డ్డ‌ట్టు అవుతుంది.

Telugu @cm_kcr, Eetala Rajender-Telugu Political News

ఈ మూడు ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఒకేసారి మూడు విషయాల్లో త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు.అలా కాకుండా ఒక‌వేళ ఓడిపోతే ఈ మూడు విషయాల్లో టీఆర్ ఎస్ కు కోలుకోలేని దెబ్బ త‌గులుతుంది.బీజేపీని ఆప‌డం ఇంక సాధ్యం కాదు.అయితే హ‌రీశ్‌రావు నేతృత్వంలోనే ఉప ఎన్నిక‌కు వెళ్లే ఛాన్స్ ఉంది.ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌ముఖ నాయ‌కుల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్లాన్‌ను ట్ర‌బుల్ షూట‌ర్ వేగం చేశారు.

స‌గానికి పైగా మంత్రుల‌ను హుజూరాబాద్‌లోనే పెట్టారు కేసీఆర్‌.మండ‌లానికి క‌నీసం ముగ్గురు చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను రంగంలోకి దింపారు.

మ‌రి కేసీఆర్ ఈస్థాయిలో ప్లాన్ వేసిన‌ట్టు స‌క్సెస్ అవుతారా లేదా అన్న‌ది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube