ఢిల్లీలో ప్రధాని నివాసంలో సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్లు మీడియాలో వార్తలు జోరందుకున్నాయి.మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వాన్ని విభేదించే నాయకులు పార్టీలో ఎక్కువైన పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 Cm Yogi Adityanath Meets Modi Delhi, Yogi Adityanath, Modi, Upa Congresss,  Cent-TeluguStop.com

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఫలితాలు రావడంతో పాటు ప్రధాని మోడీ పార్లమెంట్ పరిధిలో వారణాశి అదే విధంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గాలలో ప్రత్యర్థి పార్టీలు గెలిచాయి.

ఇటువంటి తరుణంలో యూపీఏ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన జితేంద్ర ప్రసాద్ నీ పార్టీలో చేర్చుకోవడం తో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కి బీజేపీ హైకమాండ్ చెక్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉండగా ప్రధాని మోడీ తో ఈరోజు న్యూఢిల్లీలో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.అయితే ఈ భేటీలో అమీతుమీ తేల్చుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

పని మరోపక్క ఇది సాధారణ సమావేశం అని యూపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఏది ఏమైనా యూపీలో బీజేపీ పార్టీ దిగజారి పోవటానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ కారణమని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు అందు వల్లే జితేందర్ ప్రసాద్ ని రంగంలోకి దింపినట్లు యూపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube