సెకండ్‌ వేవ్‌ తో వాయిదా పడ్డ సినిమాలకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?

గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారనంగా దాదాపుగా 10 నెలల పాటు షూటింగ్‌ లు నిలిచి పోయాయి.అదే సమయంలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.

 Corona Second Wave Effect On Telugu Ready To Release Films, Acharya, Corona Effe-TeluguStop.com

దాంతో పెద్ద ఎత్తున నిర్మాతలు నష్టపోయారు.ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉంది.

కాని కరోనా మొదటి మరియు సెకండ్‌ వేవ్‌ వల్ల ఏకంగా వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా వేశారు.ఏడాదిన్నర సినిమా ఆలస్యం అవ్వడం వల్ల దాదాపుగా వంద కోట్ల మేరకు అదనపు భారం నిర్మాతపై పడబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా కోసం నిర్మాత దాదాపుగా 350 కోట్ల మేరకు ఫైనాన్స్ ను తెచ్చాడు.సినిమా కోసం దానయ్య తెచ్చిన అప్పు కు 2 శాతం వడ్డీ చొప్పున చెల్లించాల్సి ఉంటుందట.

అంటే అప్పుగా తెచ్చిన మొత్తం కు రోజు రోజుకు వడ్డీ కొండల పెరిగి పోతూనే ఉంటుంది.ఇలా ఆర్ ఆర్‌ ఆర్‌ కు మాత్రమే కాకుండా వాయిదా పడ్డ అన్ని సినిమాలకు కూడా భారీ మొత్తంలో భారం పడబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు దాదాపుగా 100 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతుంది.ఇక కేజీఎఫ్‌ సినిమా ఆలస్యం అవ్వడం వల్ల పాతిక కోట్ల మేరకు ఇప్పటికే భారం పడింది.

త్వరలో కేజీఎఫ్‌ 2 విడుదల అవ్వబోతుంది.ఆ తేదీన విడుదల కాకుంటే ఖచ్చితంగా మరో అయిదు నుండి పది కోట్ల వరకు భారం తప్పదు అంటున్నారు.

Telugu Acharya, Corona Effect, Corona Wave, Kgf, Love Story, Pushpa, Radheshyam,

ఇక రాధే శ్యామ్ సినిమాకు గాను రూ.50 కోట్ల వరకు అదనపు భారం పడుతున్నట్లుగా చెబుతున్నారు.ఇక ఆచార్య సినిమా 10 కోట్ల వరకు అదనంగా బడ్జెట్‌ పెరిగిందట.పుష్ప సినిమా కు ఇప్పటి వరకు 5 కోట్ల వరకు బడ్జెట్‌ పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.

లవ్‌ స్టోరీ మీడియం బడ్జెట్‌ తో రూపొందినా కూడా ఆ సినిమా ఆలస్యం వల్ల ఏకంగా 5 కోట్ల వరకు నష్ట పోవాల్సి వచ్చిందని అంటున్నారు.మొత్తంగా సినిమా లు అన్ని కూడా లక్షల నుండి కోట్ల వరకు నష్టపోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube