జ‌గ‌న్ ఢిల్లీ టూర్ స‌ఫ‌ల‌మైన‌ట్టేనా?.. ఆ అంశాల‌పై దృష్టి!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏది చేసినా ఒక ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి.ఆయ‌న ఇప్పుడు ఢిల్లీ టూర్‌లో ఉన్నారు.

 Is The Jagan Delhi Tour A Success? .. Focus On Those Aspirations!, Ycp, Bjp, Ap-TeluguStop.com

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను జ‌గ‌న్ క‌లిశారు.అలాగే మరికొందరు కేంద్రమంత్రులను కూడా జ‌గ‌న్ మీట్ అయ్యారు.

అయ‌తే ప్ర‌ధాని మోడీతో క‌లిసి అనేక విష‌యాల‌పై చ‌ర్చించాల్సి ఉన్నా అంత టైమ్ మోడీ ఇవ్వ‌డు కాబట్టి వాటిని అమిత్ షాతో చ‌ర్చించారు జ‌గ‌న్‌.ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తర్వాత అంతటి ప‌వ‌ర్ ఉన్న నేత కేవ‌లం అమిత్ షా మాత్ర‌మే.

అయితే అమిత్ షాతో జగన్ భేటీ దాదాపు గంటన్నరకు పైగా సాగింది.అయితే జ‌గ‌న్ స‌డెన్‌గా ఢిల్లీ టూర్ వేయ‌డం కాస్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఎందుకంటే జ‌గ‌న్ టూర్‌కు ముందు ర‌ఘురామ ఢిల్లీలోనే మ‌కాం వేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ‌రుస‌గా అంద‌రికీ లేఖ‌లు రాశారు.

Telugu @bjp4india, Amithsha, Andhra Cm Jagan, Delhi, Karnul Hogh, Modi, Polavara

కేంద్ర మంత్రుల‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు.ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ జ‌గ‌న్ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర‌మంత్రుల‌న క‌లిశారు.కానీ జ‌గ‌న్ మాత్రం ఎక్కువ‌గా మూడు రాజధానుల అంశం పైనే చ‌ర్చించ‌డానికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

Telugu @bjp4india, Amithsha, Andhra Cm Jagan, Delhi, Karnul Hogh, Modi, Polavara

దానితో పాటు కర్నూలుకు హైకోర్టును త‌ర‌లించ‌డానికి రీ నోటిఫికేషన్ ఇవ్వాల‌నేది ప్ర‌ధాన అంశం.బీజేపీ అధికారంలోకి వ‌స్తే క‌ర్నూలుకు హైకోర్టు ఇస్తామ‌ని మేనిఫెస్టోలో చెప్పింది.అదే విష‌యాన్ని ఇప్పుడు జ‌గ‌న్ గుర్తు చేసిన‌ట్టు స‌మాచారం.ఇక పోలవరం ప్రాజెక్టు లో రివైజ్డు ఎస్టిమేట్స్ కార్య‌క‌లాపాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఆమోద ముద్ర వేయాల‌ని కూడా జ‌గ‌న్ కోరారు.

కాగా జ‌గ‌న్ తీసుకొచ్చిన ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై కేంద్రం సానుకూలంగానే స‌మాధానం ఇచ్చిన‌ట్టు స‌మాచారం.కాక‌పోతే ఇందులో పోల‌వ‌రం ఎస్టిమేట్స్ అంశం త‌ప్ప మిగ‌తా ప్ర‌తిపాద‌న‌లైన మూడు రాజధానుల ఏర్పాటు, కర్నూలుకు హైకోర్టు అనేవి కేంద్రం ఇప్ప‌టికిప్పుడు నిర్ణ‌యం తీసుకోద‌గ్గవే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube