మేనల్లుడికి పెరిగిన ప్రాధాన్యం ! అదే కేసీఆర్ రాజకీయం ?

టిఆర్ఎస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.మొన్నటి వరకు కేసిఆర్ మేనల్లుడు హరీష్ రావును పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ఇపుడు ఆయన కు ఎక్కడలేని ప్రాధాన్యతను ఇస్తున్నారు.

 Increased Prominence For Harish Rao In The Trs Party Kcr,ktr, Telangana, Etela R-TeluguStop.com

కేటీఆర్ రాజకీయ వారసుడు కావడంతో ఆయన కు సీఎం బాధ్యతలు అప్పగించేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా హరీష్ కు ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారు.కేవలం హరీష్ కు ఇచ్చిన ఆర్థిక శాఖ కే పరిమితం చేసి ఆయన తెలంగాణలో పెద్దగా పర్యటనలు చేయకుండా కట్టుదిట్టం చేశారు.

అయితే ఇప్పుడు మాత్రం హరీష్  నిర్వహిస్తున్న  ఆర్థిక శాఖ తో పాటు, వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆయనకు అప్పగించారు.

 వీటితో పాటు మరిన్ని అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు గా ప్రస్తుత వ్యవహారాలు కనిపిస్తున్నాయి.

తాజాగా హరీష్ రావ్ తెలంగాణలో నిరుద్యోగ సమస్య పైన,  వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల పైన, ఖాళీల భర్తీ తదితర అంశాలపై హరీష్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.మామూలుగా అయితే హరీష్ రావ్ ఇంత చొరవ తీసుకుని ఈ సమీక్షలు నిర్వహించే అవకాశమే లేదు.

ఇవన్నీ కేసిఆర్ నిర్వహించాల్సిన బాధ్యతలే.అయినా ఇవన్నీ హరీష్ తీసుకోవడం , అదనంగా కొన్ని మంత్రిత్వ శాఖలు నిర్వర్తించడం ఇలా ఒక్కసారిగా హరీష్ ప్రాధాన్యం పెరగడం పై  తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Telugu Etela Rajendra, Hareesh Rao, Huzurabad, Telangana-Telugu Political News

కేటీఆర్ కు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇప్పుడు హరీష్ కు ఇవ్వడం ఆయనపై ప్రేమతో కాదని,  ప్రస్తుతం ఈటెల రాజేందర్ వ్యవహారంలో హరీష్ చురుగ్గా ఉండటం,  పదేపదే హరీష్ పైన సానుభూతి చూపిస్తూ తనలాగే హరీష్ రావు టీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలకు గురయ్యారు  అంటూ టిఆర్ఎస్ ను డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతున్న మాటలు అన్నింటిని హరీష్ రావు తిప్పికొడుతూ ఉండడంతో ఈ విధంగా హరీష్ ప్రాధాన్యం కేసీఆర్ పెంచారు అనే చర్చ జరుగుతోంది.ఏది ఏమైనా ఈటెల ఎఫెక్ట్ తో హరీష్ రావు మళ్లీ ఫామ్ లోకి వచ్చారని హరీష్ వర్గీయులు సంబరపడుతున్నారు.కాకపోతే ఈ ప్రాధాన్యం ఎంత కాలం ఉంటుందో ?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube