స్టూడెంట్ వీసాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్... తొలి ప్రాధాన్యత వారికే...!!

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేందుకు ఎంతో మంది విద్యార్ధులు ఆశక్తి చూపుతుంటారు.ఇలా అమెరికా వెళ్ళే విద్యార్ధులలో అత్యధిక శాతం భారతీయ విద్యార్ధులే అధికంగా ఉంటారు.

 Us To Resume Student Visa Processing From June14th, Student Visa ,covid Rules, A-TeluguStop.com

అయితే కోవిడ్ నిభంధనల్ దృష్ట్యా గత కొద్ది కాలంగా అమెరికాలోకి విదేశీయుల ప్రయాణాలను నిలిపివేస్తింది ప్రభుత్వం, కేవలం అత్యవసర పరిస్థితుల నేపధ్యంలో అది కూడా కోవిడ్ నిభందనలు అనుసరించి ప్రయాణికులకు అనుమతులు ఇస్తున్నారు.కానీ ప్రస్తుతం అమెరికాలో విద్యా తరగతులు త్వరలో ప్రారంభం కానున్న నేపధ్యంలో భారత్ లో ఉన్న అమెరికా ఎంబసీ కీలక ప్రకటన చేసింది.

సోమవారం నుంచీ స్టూడెంట్ వీసా ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టుగా ఢిల్లీ లో ఉన్న అమెరికా కార్యాలయ క్యాన్సులేట్ వ్యవహారాల మంత్రి హెప్లిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.జులై, ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే క్లాసులకు హాజరయ్యే విద్యార్ధులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇదిలాఉంటే పర్యాటక వీసాలుగా పరిగణించే బి 1, 2 లకు మాత్రం సమయం పడుతుందని తెలిపారు.అయితే గతంలో అమెరికాలోని విద్యాలయాలు జారీ చేసే ఐ -20 లో ప్రకటించిన తేదీ కంటే ముందుగా విద్యార్ధులు నెల రోజులు ముందే అమెరికా వెళ్లేందుకు అవకాశం ఉండదు కానీ పరిస్థితుల నేపధ్యంలో ఈ నిభందనలు సడలించింది యూఎస్ ప్రభుత్వం.

Telugu America, America Visa, Covid, Visa, Visa Interviews, Embassy Delhi-Telugu

జులై, ఆగస్టు నెలల్లో విద్యా సంవత్సరం మొదలయ్యే విద్యార్ధులు ఇప్పటికే ఇంటర్వ్యూ సమయం తీసుకోని వారు వీసా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చని తెలిపారు.అయితే గతంలో అపాయింట్మెంట్ తీసుకుని రద్దయిన వారు కూడా ఇంటర్వ్యూ కోసం కొత్త స్లాట్ తీసుకోవచ్చు.ప్రస్తుతం కేవలం విద్యార్ధులు వెళ్లేందుకు మాత్రమే తాము వీసా విధానం ఏర్పాటు చేశామని, వారితో పాటు తల్లి తండ్రులు వెళ్లేందుకు అనుమతులు ప్రస్తుతానికి లేవని అందుకు కొంత సమయం పడుతుందని హాప్లిన్ ప్రకటించారు.ఇదిలాఉంటే అమెరికా వెళ్లే మూడు రోజులు ముందుగానే కరోనా టెస్ట్ చేయించుకోవాలి ఒక వేళ కరోన పాజిటివ్ వస్తే వారిని అమెరికాలోకి అనుమతించమని తెలిపారు.

విద్యార్ధులు అమెరికా వెళ్ళిన తరువాత వ్యాక్సిన్ విషయంపై యూనివర్సిటీ ల నియమ నిభంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు హాప్లిన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube