ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూకుడు చూపించిన టీమిండియా ఆల్ రౌండర్..!

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ స్టార్‌ రవీంద్ర జడేజా దూకుడు మీదున్నాడు.ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌‌ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు ఎగబాకాడు.386 రేటింగ్‌ పాయింట్లతో ఉన్న రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్‌లో సూపర్ వేగంతో దూసుకొస్తున్నాడు.టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ జేసన్‌ హోల్డర్‌ 423 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

 Team India All-rounder Aggressive In Icc Rankings Icc Ranking, Team India, All R-TeluguStop.com

టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌ సెకండ్‌ ర్యాంకు నిలబెట్టుకున్నాడు.

మరోవైపు ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 814 పాయింట్లు, రిషబ్‌ పంత్‌ 747, రోహిత్‌ శర్మ 747 పాయింట్లతో వరుసగా 5, 6, 7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.అయితే న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ జాబితాలో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.

Telugu Rounder, Icc, Ups, India-Latest News - Telugu

మరో వైపు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ముందు టీమిండియాకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం ఇబ్బందికరమేనని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నాడు.

Telugu Rounder, Icc, Ups, India-Latest News - Telugu

ఏదేమైనా కోహ్లీసేనలో పోరాట పటిమ దాగుందని వివరించాడు.ఆస్ట్రేలియా పర్యటనలో మనం దానిని చూశామని గుర్తుచేశాడు.తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంగ్‌సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

న్యూజిలాండ్‌పై అంచనాలు లేకపోవడం కూడా ఆ జట్టుకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.ప్రస్తుతం భారత్‌ మెరుగైన జట్టని, గొప్ప ఫామ్‌లో ఉందని వెంగ్‌సర్కార్ ప్రశంసించాడు.

న్యూజిలాండ్‌పై అంచనాలు తక్కువగా ఉండటం కూడా వారికి కలిసొచ్చే మరో అంశంగా పేర్కొన్నాడు.ఫైనల్‌కు ముందే ఇంగ్లండ్‌తో వారు రెండు టెస్టులు ఆడటం వల్ల పరిస్థితులపై వారికి అవగాహన వస్తుందని వెల్లడించారు.

జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, కివీస్‌ ఫైనల్లో తలపడుతున్న విషయం తెలిసిందే.ఫస్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube