అన్నింటా నేనుంటా అంటున్న తమన్నా

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి తమన్నా భాటియా.ఈ బ్యూటీ శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తరువాత శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది.

 Tamannaah Focus On Silver Screen And Digital Also, November Story, Seeti Maar Mo-TeluguStop.com

ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సైరాలో, విక్టరీ వెంకటేష్ కి జోడీగా ఎఫ్2 లో కూడా నటించి సీనియర్ హీరోల పక్కన నటించిన బ్యూటీగా నిలిచిపోయింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ ఎఫ్3 మూవీతో పాటు నితిన్ మ్యాస్ట్రో మూవీలో నటిస్తుంది.

గోపీచంద్ కి జోడీగా నటించిన సిటీమార్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది.మరో వైపు ఇప్పటికే తమన్నా డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసి అప్పుడే రెండు వెబ్ సిరీస్ లని ఫినిష్ చేసింది.

అయితే ఈ రెండు వెబ్ సిరీస్ లు బాగున్నాయనే టాక్ తెచ్చుకున్న అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి.

అయితే తమన్నా మాత్రం వెబ్ సిరీస్ ల విషయంలో అస్సలు వెనక్కి తగ్గేది లేదని అంటుంది.

అలాగే కెరియర్ ప్లానింగ్ గురించి కూడా ఆసక్తికర వాఖ్యలు చేసింది.ఇకపై సినిమాలలో హీరోయిన్ గా చేయాలనే రూల్స్ ఏమీ పెట్టుకోలేదని, పాత్ర ప్రాదాన్యత, కంటెంట్ బట్టి ఎలాంటి క్యారెక్టర్స్ అయిన చేయడానికి రెడీ అని పేర్కొంది.

ఎప్పటికప్పుడు తనని తాను మెరుగుపరుచుకుంటూ కొత్త కొత్త పాత్రలు చేయడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

Telugu Maestro, November Story, Seeti Maar, Tamannaah, Tollywood-Movie

అలాగే వెబ్ సిరీస్ ల కి కూడా తన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది.డిజిటల్, సిల్వర్ స్క్రీన్ లలో ఎక్కడైనా తనని చూడొచ్చని పేర్కొంది.కేవలం తన దృష్టి అంతా విభిన్న పాత్రలు చేయడంపనే ఉంటుందని చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube