ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ రేటు ఫిక్స్ చేసిన కేంద్రం..!

దేశ ప్రజలకందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది.ఇప్పటివరకు వ్యాక్సిన్ ప్రోగ్రాం ఎలా జరిగినా ఇక మీదట అది వేగవంతం చేయాలని చూస్తున్నారు.

 Centre Fix Maximum Price For Vaccine In Private Hospitals, Centre , Corona Vacci-TeluguStop.com

ప్రభుత్వం అందించే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉచితంగానే ఉంటుంది.అయితే ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వేసుకోవాలని అనుకునే వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ పై ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టుగా రేటు ఫిక్స్ చేయకుండా కేంద్రం ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ ధరని ఫిక్స్ చేసింది.

కొవిషీల్డ్ కు 780, కొవాగ్జిన్ కు 1410, స్పుత్నిక్ వి కి 1145 మాత్రమే గరిష్ట ధరగా ఫిక్స్ చేశారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ కు సర్వీస్ ఛార్జ్ 150 రూ.లు మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వం ఏర్పరచే వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనలేని వారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.ఇప్పటికే తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది.

జిల్లాల వారిగా ఈ వ్యాక్సిన్ ప్రోగ్రాం మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలందరికి వ్యాక్సిన్ అందించే క్రమంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube