మళ్లీ కష్టాల్లోకి ‘బాబా కా దాబా’ తాత!

కరోనా నేపథ్యంలో గత ఏడాది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన బాబా కా దాబా తాతకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు.గత సంవత్సరం ఆయన ప్రారంభించిన రెస్టారెంట్‌ లాక్‌డౌన్‌తో మూతపడింది.

 Baba Ka Dhaba Again Returned To Its Roadside Stall, Baba Ka Dhaba, Delhi, Restau-TeluguStop.com

ఇక ఆయన మళ్లీ రోడ్డు పక్క స్టాలే దిక్కైంది.ఈ తాత ఢిల్లీలోని మాల్వీయాలో రోడ్డు పక్క స్టాల్‌లో ఆహారం విక్రయిస్తూ ఉండేవారు.

ఆయనతో పాటు భార్య కూడా ఉంది.గతేడాది లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా చితికిపోయినట్లు దీంతో తాము రోడ్డున పడిన దుస్థితి ఏర్పండిదని విచారం వ్యక్తం చేస్తూ .ఓ వీడియోను షేర్‌ చేశారు.ఆ వీడియోతో చాలా మంది రియాక్ట్‌ అయ్యారు.

చాలా మంది ఆయన స్టాల్‌కు క్యూ కట్టిన సంగతి కూడా తెలిసిందే.ఫుడ్‌ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలో కూడా ‘బాబా కా దాబా’ కు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి.

దీంతో ఆ తాతగారు రెస్టారెంట్‌ కూడా ఓపెన్‌ చేశారు.

అసలు తాతయ్య కాంతా ప్రసాద్‌.

ఆయన భార్య బాదామీ దేవి.కొవిడ్‌కు ముందు రూ.5 లక్షల పెట్టుబడితో రెస్టారెంట్‌ ప్రారంభించారు.అప్పుడు వారికి కనీసం రూ.3,500 ఆదాయం వచ్చేది.మళ్లీ కొవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధిండడంతో ప్రతిరోజూ కేవలం వెయ్యి రూపాయలు రావడం కూడా కష్టతరంగా మారింది.

రెస్టారెంట్‌ నడవడానికి కష్టతరంగా ఉండేది.దీంతో షాపులో పనిచేసే ముగ్గురు పనివాళ్లు, షాపు అద్దె, జీతాలు, కరెంటు, వాటర్‌ కిరాణా తదితర సామాగ్రికి కలిసి నెలకు సుమారు రూ.లక్ష వరకు ఖర్చయ్యేది.అయితే, రెస్టారెంటుకు కనీసం రూ.40 వేలు కూడా ఆదాయం లభించేది కాదు.దీంతో ప్రారంభించిన మూడు నెలల్లోనే ప్రసాద్‌ రెస్టారెంటును మూసివేయాల్సి దుస్థితి ఏర్పడింది.దీంతో ఆయన రెస్టారెంటులోని సామాగ్రీ అంతా విక్రయించాడు దీనికి కేవలం రూ.30 వేలు మాత్రమే దక్కాయి.

Telugu Lockdown, Baba Ka Daba, Restaurant-Latest News - Telugu

అయితే, రెస్టారెంట్‌ను అమ్మడానికి ప్రధాన కారణం సామాజిక కార్యకర్త తుశాంత్‌ అద్లాఖా అని ప్రసాద్‌ ఆరోపించారు.రెస్టారెంట్‌ను ప్రారంభించిన తర్వాత నడిపించే బాధ్యత తనేదనని చెప్పి ఇప్పుడు పట్టించుకోలేదని తెలిపారు.కానీ, అద్లాఖా మాత్రం ఈ వైఫల్యానికి కారణం అతడి ఇద్దరి కొడుకులేనని తెలిపాడు.‘‘వారెప్పుడు కౌంటర్‌ వద్దే ఉండేవారు కాదు.హోం డెలివరీ కోసం ఎన్నో ఆర్డర్లు వచ్చేవి.కానీ, వాటిని డెలివర్‌ చేయడంలో విఫలమయ్యారు’’ అని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube