మీ అసలు వయసెంతని  హీరోయిన్ ని అడిగిన నెటిజెన్.. దాంతో... 

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు తమ అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది.ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు అప్పుడప్పుడు లైవ్ కార్యక్రమాలు మరియు చిట్ చాట్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ బాగానే అందుబాటులో ఉంటున్నారు.

 Telugu Young Heroine Varsha Bollamma React About Her Age, Telugu Young Heroine,-TeluguStop.com

కాగా తెలుగులో హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “మిడిల్ క్లాస్ మెలోడీస్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన ప్రేక్షకులను బాగా అలరించిన యంగ్ హీరోయిన్ “వర్ష బొల్లమ్మ” గురించి ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు.

కాగా వర్ష బొల్లమ్మ తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొంతమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

అయితే ఇందులో భాగంగా ఓ నెటిజన్ గూగుల్ లో మీ వయసు 25 సంవత్సరాలని చూపిస్తుందని కాబట్టి నీ అసలు వయసు ఎంతని అడిగాడు.దీంతో వర్ష బొల్లమ్మ ఈ విషయంపై స్పందిస్తూ తమ అసలు వయసు 24 సంవత్సరాలని స్పష్టం చేసింది.

దీంతో కొందరు నెటిజన్లువర్ష బొల్లమ్మ అసలు వయసుపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

Telugu Meddle Class, Telugu Young, Teluguyoung, Varsha Bollamma-Movie

అయితే తెలుగులో వర్ష బొల్లమ్మ నటించిన బిగిల్, మిడిల్ క్లాస్ మెలోడీస్ తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.దీంతో ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు కూడా బాగానే తలుపు తడుతున్నట్టు సమాచారం.కాగా ఆ మధ్య వర్ష బొల్లమ్మ కన్నడలో “మనే నంబర్ 13” అనే చిత్రంలో నటించి కన్నడ సినిమా పరిశ్రమ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ చిత్రం హిట్ అవ్వడంతో ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.దీంతో తమిళ వర్షన్ లో కూడా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube