ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో అలాంటి నరకం చూసిందా..?

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కు జోడీ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను అందుకున్నారు.అదే సమయంలో వరుసగా మూవీ ఆఫర్లు సంపాదించుకుని విజయాలు సొంతం చేసుకున్నారు.

 Senior Star Heroine Aarti Agarwal Death Anniversary Story On Behind The Death Re-TeluguStop.com

ఒకవైపు సీనియర్ స్టార్ హీరోలతో మరోవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేయడం ఆర్తి అగర్వాల్ కే చెల్లింది.తక్కువ సినిమాలే చేసినా ఆర్తి అగర్వాల్ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.

అయితే జూన్ 6వ తేదీ ఆమె వర్ధంతి కావడంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమె మరణం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.ఇంద్ర, నువ్వులేక నేనులేను సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.

అయితే 2005 సంవత్సరం ఆర్తి అగర్వాల్ తలకు బలమైన గాయం కావడం ద్వారా వార్తల్లో నిలిచారు.

Telugu Aarti Agarwal, Anniversary-Movie

మరోవైపు ఆర్తి అగర్వాల్ ఒక యువహీరోతో ప్రేమలో ఉన్నారని లవ్ ఫెయిల్యూర్ కావడంతో ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వచ్చాయి.ఈ వార్తలు ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి.బరువు పెరగడం వల్లే సినిమా ఆఫర్లు తగ్గాయని భావించిన ఆర్తి అగర్వాల్ బరువు తగ్గడం కొరకు లైపోసక్షన్ చేయించుకున్నారు.

అయితే ఆమె ఊహించని విధంగా ఆ సర్జరీ ఫెయిల్ అయింది.

Telugu Aarti Agarwal, Anniversary-Movie

సర్జరీ ఫెయిల్ అయిన తరువాత ఆర్తి అగర్వాల్ దాదాపు ఆరువారాల పాటు నరకం చూశారని సమాచారం.ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొన్నారని తెలుస్తోంది.ఆర్తి అగర్వాల్ దగ్గర మేనేజర్ గా పని చేసిన వ్యక్తి ఈ విషయాలను వెల్లడించారు.

ఆమె మృతి విషయంలో ఇప్పటికీ ఆమె అభిమానులకు ఎన్నో అనుమానాలు ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube