వైరల్: కూతురి స్థానంలో స్కూలుకెళ్లిన తల్లి..!

కరోనా మహమ్మారి కారణంగా బడులు బంద్‌ కాగా, ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.చిన్నారులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వింటుండడంతో తల్లులకు మరింత బాధ్యత పెరిగింది.

 Viral: Mother Goes To School Instead Of Daughter  Viral Latest, Viral News, Moth-TeluguStop.com

ఫోన్‌లో జూమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి దగ్గరుండి క్లాసులను వినేలా చూసుకుంటున్నారు.ఆటలు, టీవీ, సెల్‌ఫోన్లకు పరిమితమవుతున్న చిన్నారులను చక్కదిద్దుతూ చదువులో తమ సహకారాన్ని అందిస్తున్నారు.

పిల్లల హోంవర్క్‌ విషయంలోనూ అమ్మలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సందేహాలను నివృత్తి చేస్తున్నారు.ఉదయం నిద్ర లేపడం మొదలు క్లాసులు విన్న తర్వాత హోం వర్క్‌ చేయించే వరకు వెన్నంటి ఉండి చదువుకు సాయం చేస్తున్నారు.

పూర్తయిన హోంవర్క్‌ను ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులకు పంపించి పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక పరీక్షల సమయంలో గంటల తరబడి పిల్లలతోపాటు కూర్చొని చదివిస్తున్న అమ్మలు పుస్తకాలను తిరిగేస్తూ ఉపాధ్యాయుల పాత్రను పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం లాక్ డౌన్ కేసులు తగ్గుతుండటం వల్ల మెల్లగా ఒక్కొక్కటే తెరుచుకుంటున్నాయి.

అమెరికాలో కూడా స్కూళ్లు యథావిధిగా సాగిస్తున్నారు.

అయితే అమెరికాలో ఒక విచిత్రం జరిగింది.ఒక 30 ఏళ్ల యువతి తన 13 ఏళ్ల కూతురిలా వేషం మార్చి మరీ పాఠశాలకు వెళ్లింది.

పాఠశాలలో ఎవరూ ఆమెను గుర్తించలేకపోయారు.ఆ రోజంతా క్లాసుల్లో కూర్చుని ఆమె పాఠాలు వింది.

ఆ తర్వాత లాస్ట్ క్లాస్ లో ఓ ఉపాధ్యాయురాలు పట్టుకుంది.ఇదంతా ఎందుకు చేశావని ఆ తల్లిని ఉపాధ్యాయురాలు ప్రశ్నించింది.

స్కూలు భద్రతా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపేందుకే తాను ఈ సోషల్ ఎక్స్‌పెరిమెంట్ నిర్వహించానని 30 ఏళ్ల కేసీ గ్రేసియా తెలిపింది.

Telugu Mother, School, Latest-Latest News - Telugu

ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గ్రేసియాను అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం ఈ సంఘటన వైరల్ అవుతోంది.పిల్లల చదువుల కోసం ఆ తల్లి చేసిన పనికి మెచ్చుకుంటున్నా అలా చేయడం తప్పు కాబట్టి ఆమెను మందలివ్వడానికి సిద్దమయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube