షూటింగ్ లకి సిద్ధం అవుతున్న టాలీవుడ్ దర్శక, నిర్మాతలు

గత రెండేళ్ళ నుంచి చిత్ర పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది.గత ఏడాదిలో మెజారిటీ సమయం లాక్ డౌన్ లో పోయింది.

 Tollywood Directors Ready To Movie Shooting Plans July On Wards, Acharya, Rrr Mo-TeluguStop.com

దీంతో వేల కోట్ల రూపాయిలు నిర్మాతలు నష్టపోయి ఆర్ధికంగా దెబ్బ తిన్నారు.అయితే డిసెంబర్ నుంచి సినిమాల షూటింగ్ లకి పూర్తిస్థాయి పర్మిషన్ ఇవ్వడంతో పాటు థియేటర్స్ కూడా ఓపెన్ కావడంతో పరిస్థితి చక్కబడుతుందని అందరూ భావించారు.

ఈ నేపధ్యంలో పెండింగ్ లో ఉన్న సినిమాలని వరుసగా రిలీజ్ చేస్తూ వచ్చారు.అలా రిలీజ్ అయ్యి జాతి రత్నాలు, వకీల్ సాబ్, క్రాక్ మూవీస్ మంచి లాభాలు సొంతం చేసుకోవడంతో పాటు ఆడియన్స్ ని కూడా థియేటర్ కి రప్పించాయి.

దీంతో మళ్ళీ థియేటర్స్ కళకళలాడుతాయని అందరూ భావించి వరుసగా సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు.అయితే ఈ ఏడాది మార్చిలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.

దీంతో మార్చి ఆఖరు నాటికి థియేటర్స్ మూత పడ్డాయి.ఇక షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.

రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.దీంతో టాలీవుడ్లో చిన్న ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చాయి.

అలాగే నిర్మాతలకి టెన్షన్ కూడా మొదలైంది.ఈ సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఇంత కాలం ఉంటుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది.అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దర్శక, నిర్మాతలకి సినిమాల పరంగా కొంత ఊరట లభించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

Telugu Acharya, Adi Purush, Adipurush, Allu Arjun, Corona Effect, Corona Wave, O

షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం బయటకి రావడంతో ఇప్పుడు షూటింగ్ లకి ప్లాన్ చేసుకుంటున్నారు.కొత్త షెడ్యూల్స్ వేసుకుంటూ చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు దర్శక, నిర్మాతలు బిజీగా ఉన్నారు.చాలా వరకు సినిమాలు జులై నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

వీటిలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ నుంచి ఓం రౌత్ ఆది పురుష్, సుకుమార్ పుష్ప లాంటి పెద్ద సినిమాలు కూడా ఉండటం విశేషం.ఈ షూటింగ్ ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయి అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube