కరోనా థర్డ్ వేవ్ పై సీఎం జగన్ సమీక్ష.. ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ..!

కరోనా సెకండ్ వేవ్ తర్వాత రాబోయే థర్డ్ వేవ్ పై కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో కరోనా థర్డ్ వేవ్ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

 Ap Cm Ys Jagan Review On Covid Third Wave , Andhrapradesh , Ap,  Ap Corona Case,-TeluguStop.com

అధికారులు థర్డ్ వేవ్ పై అనాలసిస్, డేటాలను సీఎం కు చెప్పారు.అసలు థర్డ్ వేవ్ వస్తుందా లేదా అన్న దాని మీద శాస్త్రీయ నిర్ధారణ లేదని అధికారులు వెల్లడించారు.

ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఏర్పడే సమస్యలు, ప్రభావితమయ్యే వారి వివరాలపై అంచనాలను సీఎం కు చెప్పారు.వ్యాక్సిన్ ప్రోగ్రాం కొనసాగించడంతో పాటుగా పోషకాహార కార్యక్రమం కొనసాగాలని చెప్పారు.

మందులు, పరికరాలు, బయోమెడీకల్ ఎక్విప్మెంట్, మిగతా అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు.

ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందనే అంశాల మీద తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

పీడియాట్రిక్ సింప్టంస్ ను కనుపెట్టడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని అన్నారు.హాస్పిటల్స్ లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.థర్డ్ వేవ్ వస్తుందని అంచనా ఉంది కాబట్టి మెడిసిన్ కూడా ముందే తెచ్చి పెట్టుకోవాలని అన్నారు.పిల్లల డాక్టర్లను గుర్తించాలని.

వారిని రిక్రూట్ చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు.పిల్లల కోసం 3 కొత్త హాస్పిటల్స్ నిర్మించాలని వాటిలో వైద్య సేవలను అందిచడానికి ఏర్పాటు చేయాలని అన్నారు.వైజాగ్, కృష్ణ-గుంటూర్, తిరుపతి లో పీడియాట్రిక్ కేర్ సెంటర్లను సిద్ధం చేయాలని అన్నారు జగన్.180 కోట్ల చొప్పున ఒక్కో హాస్పిటల్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం జగన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube