అభిమానులకు బాలకృష్ణ విన్నపం.. పుట్టినరోజు వేడుకలకు రావొద్దని సూచన..!

నందమూరి నట సింహం.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమానులను రిక్వెస్ట్ చేశారు.

 Nandamuri Balakrishna Request To His Fans His Birthday Celebrations, Balaiah, B-TeluguStop.com

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు.ప్రతి ఏటా బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగ అభిమానులు వేడుకలను ఘనంగా జరుపుతారు.

ప్రస్తుతం కరోనా సంక్షోభంలో తన పుట్టినరోజు సందర్భంగా అభిమానిలు ఎవరు రావొద్దని అన్నారు బాలకృష్ణ.నా ప్రాణ సమానులైన అభిమానులకు అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో పెట్టారు.

ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా ఎక్కడెక్కడి నుండో తరలి వస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడిని.కరోనా టైం లో ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయటకు రావడం మంచిది కాదు.

మీ అభిమానమే నన్ను ఇంతటి వాడిని చేసింది.ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను.

మీ అభిమానంతో సాటిరాగల ఆశీస్సు లేదు.మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్షలు లేదని అన్నారు బాలకృష్ణ.

మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపడమే నా జనందిన వేడుకగా భావిస్తానని అన్నారు బాలకృష్ణ.దయచేసి పుట్టినరోజు నాడు ఎవరు అభిమానులు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన అభిమానులకు, కార్యకర్తలకు, అబ్భాగ్యులకు నివాళులు అర్పిస్తున్నానటూ ప్రత్యేక వీడియోలో పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube