వార్డుల వారీగా వ్యాక్సిన్ విధానం.. ఢిల్లీ సీఎం సరికొత్త నిర్ణయం..!

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా ఆ ప్రక్రియ మరింత వేగవంతం చేసేలా కార్యచరణలు చేస్తున్నారు.

 Delhi Cm Aravind Kejriwal Launched Jaha Vote Waha Vaccination Campaign, Aravind-TeluguStop.com

ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారికి మూడు నాలుగు వారాల్లో వ్యాక్సిన్ వేసేలా ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.ఓటు ఎక్కడో అక్కడే వ్యాక్సినేషన్ జహా ఓట్, వహా వ్యాక్సినేషన్ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.

ప్రజలు ఎక్కడ ఓటు వేశారో అక్కడకెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు.వ్యాక్సిన్ కొరత లేకపోతే 45 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ పూర్తి చేస్తామని అన్నారు.

ఢిల్లీలో 45 ఏళ్లు పైబడీ వారు 57 లక్షల దాకా ఉన్నారని తెలుస్తుంది.ఇప్పటికే 27 లక్షల మంది తొలి డోస్ వేయించుకున్నారని సీఎం చెప్పారు.

ఇంకా 30 లక్షల మందికి ఇంకా వ్యాక్సిన్ అందించాల్సి ఉందని అన్నారు.

ప్రజలు ఓటు వేసిన పోలింగ్ కేంద్రంలోనే వ్యాక్సినేషన్ వేయించుకునేలా చూస్తున్నారు.

పోలింగ్ స్టేషన్ ఎలాగు ప్రజలకు దగ్గరే ఉంటుంది అందుకే అక్కడే వ్యాక్సిన్ కార్యక్రమం చేస్తే అందరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతున్నారు.ఢిల్లీలో 280 వార్డులు ఉన్నాయి.సోమవారం 70 వార్డుల్లో వ్యాక్సినేషన్ మొదలవుతుందని అన్నారు.బూత్ స్థాయి అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి.

బీ.ఎల్.ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి 45 ఏళ్లు పై బడిన వారి సమాచారం తెలుసుకుని.వ్యాక్సిన్ వేసుకునేలా చూస్తారని చెప్పారు.

ఢిల్లీలో కొత్తగా 381 కొవిడ్ కేసులు నమోదు కాగా.అక్కడ పాజిటివిటీ రేటు 0.5 గా ఉందని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube