గులాబీ గూటికి ఎల్‌.ర‌మ‌ణ‌?.. క‌రీంన‌గ‌ర్‌లో ప‌ట్టుకోస‌మేనా!

తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు మంచి జోరుమీదున్నాయి.రాజ‌కీయాల్లో ఈట‌ల రాజేంద‌ర్ ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే.

 L. Ramana For The Pink Gooty Do You Want To Get Caught In Karimnagar!, Tdp, Trs,-TeluguStop.com

అయితే ఈయ‌న వ్య‌వ‌హారంలో మొద‌టి నుంచి కేసీఆర్ టీమ్ వ్యూహాత్మ‌కంగా ఆలోచిస్తోంది.ఎవ‌రిని ప‌డితే వారిని మాట్లాడ‌నివ్వ‌కుండా ఆయ‌న‌కు స‌న్నిహితులుగా ఉన్న వారితోనే విమ‌ర్శ‌లు చేయిస్తోంది.

అలాగే ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఇప్పుడు ఉన్న ప‌ట్టును నిలుపుకోవ‌డానికి మ‌రో కొత్త ఎత్తుగ‌డ వేస్తోంది.

ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ రాజ‌కీయంగా కొంత వెన‌క‌బాటులో ఉన్నారు.ఆ పార్టీకి ఇక్క‌డ మ‌నుగ‌డ లేక‌పోవ‌డంతో కొంత కాలంగా సైలెంట్‌గానే ఉంటున్నారు.

దీంతో ఆయ‌న‌ను టీఆర్ ఎస్ పెద్ద‌లు త‌మ పార్టీలోకి తీసుకురావాల‌నిచూస్తున్నార‌ని తెలుస్తోంది.ఇందుకోసం ఇప్ప‌టికే గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొంద‌రికి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారంట‌.

Telugu Sanjay, Karimnagar, Trs Kcr, Ts Poltics, Ttdp, Yaraballidayar-Telugu Poli
ఎర్రబెల్లి దయాకరరావు ర‌హ‌స్యంగా సంప్రదింపులు జరిపి, ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది.అయితే త్వరలో మ‌రోసారి వీరిద్ద‌రి మధ్య భేటీ జరగనుంద‌ని, దాని త‌ర్వాత చేరిక ఉంటుంద‌ని తెలుస్తోంది.ఇదే విష‌యంలో రమణతో స్థానిక జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజయ్ కుమార్ కూడా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

Telugu Sanjay, Karimnagar, Trs Kcr, Ts Poltics, Ttdp, Yaraballidayar-Telugu Poli
పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణను తీసుకోవ‌డానిక ఓ కార‌ణం కూడా ఉందంట‌.ఇప్పుడు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న ఈటల టీఆర్ ఎస్ నుంచి వెళ్లిపోయారు.ఆ ప్లేస్‌ను మరో బీసీ నేతతోనే భర్తీ చేయాల‌ని కేసీఆర్ ర‌మ‌ణ‌ను తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

ఆయ‌న‌తోపాటు మ‌రికొంద‌రు కూడా టీడీపీలోకి వెళ్తార‌ని తెలుస్తోంది.అదే జ‌రిగితే టీడీపీ ఇక క‌నుమ‌రుగ‌యిన‌ట్టే.

ఇప్ప‌టికే ఈ వార్త ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర పెడుతోంది.అయితే రమ‌ణ రాక‌తో టీఆర్ ఎస్ క‌రీంన‌గ‌ర్‌లో మ‌ళ్లీ ఎదురులేకుండా చూసుకోవాల‌ని భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube