ఇది చాలదు... ఇండియాకు వైద్య సాయాన్ని పెంచండి: బైడెన్‌కు అమెరికా చట్టసభ సభ్యుల విజ్ఞప్తి

కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారత్‌కు అమెరికా నుంచి అందుతున్న సాయాన్ని మరింత పెంచాల్సిందిగా ఆ దేశ చట్టసభ సభ్యులు అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు.కోవిడ్ మహమ్మారిపై పోరాడటంలో భాగంగా మిత్రదేశాలకు సాయం చేయాల్సిన బాధ్యత అమెరికాకు వుందని వారు స్పష్టం చేశారు.

 Send India More Covid Medical Aid: Us Lawmakers Urge Biden Administration, India-TeluguStop.com

దీనిలో భాగంగా భారత్‌కు మరిన్ని వ్యాక్సిన్లు, వైద్య సాయం అందేలా చూడాలని కోరారు.అమెరికా ప్రజలకు ఉపయోగించని వ్యాక్సిన్లలో 75 శాతాన్ని కరోనాతో అల్లాడుతున్న దేశాలకు అందజేస్తామని జో బైడెన్ ప్రకటించిన కాసేపటికే యూఎస్ చట్టసభ సభ్యులు ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మందికి వ్యాక్సిన్లు అందజేస్తామన్న హామీలో భాగంగా కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రోగ్రామ్ కింద కోవిడ్‌పై పోరాడటానికి అమెరికా ఆయా దేశాలకు టీకా అందజేస్తుందని బైడెన్ వెల్లడించారు.ప్రస్తుతం భారత్‌ను వణికిస్తున్న కోవిడ్ సంక్షోభం తీవ్రమైనదని అందువల్ల అమెరికాకు అత్యంత కీలకమైన మిత్రదేశానికి వ్యాక్సిన్లు, వైద్య సామాగ్రిని మరింత ఎక్కువగా అందజేయాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ కోరారు.

భారత్‌ కోసం తనతో కలిసి రావాలని ఆయన ఓ ట్వీట్‌లో దేశ ప్రజలను కోరారు.

రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ మాట్లాడుతూ.

అమెరికాలో దాదాపు 300 మిలియన్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని తెలిపారు.భారత్.

అమెరికాకు అత్యంత విశ్వసనీయ దేశం ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో ఇండియా వంటి దేశాలకు బైడెన్ వ్యాక్సిన్ షేరింగ్ కార్యక్రమం లోపభూయిష్టంగా వుందని ఆయన ఆరోపించారు.కోవిడ్‌పై పోరాటంలో భాగంగా అమెరికా ఇతర దేశాలకు అండగా నిలబడాల్సిన అవసరం వుందన్నారు సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీకి చెందిన సెనేటర్ రోజర్ వికర్.

హౌస్ ఫారిన్ అఫైర్స్ సభ్యుడు మైఖేల్ మెక్‌కౌల్ మాట్లాడుతూ.దీర్ఘకాల భాగస్వామి అయిన భారత్‌కు టీకాలతో పాటు ఇతర వైద్య సాయాన్ని పెంచాలని ఆయన కోరారు.

Telugu Covaxinevaccine, Greg Abbott, India, Joe Biden, Senate, Cruz-Telugu NRI

భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా మాట్లాడుతూ.వ్యాక్సిన్ కొరతను ఎదుర్కోవడంలో భారత్‌కు అమెరికా అండగా వుండాల్సిన అవసరం వుందన్నారు.భారత్‌లో పరిస్ధితి హృదయ విదారకంగా వుందన్న కాంగ్రెస్ సభ్యుడు ఆగస్ట్ ఫ్లుగర్.మన మిత్రదేశానికి సాయం చేయాల్సిన బాధ్యత అమెరికాపై వుందని గుర్తుచేశారు.కాగా, కోవిడ్ సెకండ్ వేవ్‌లో అత్యంత క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటున్న భారతదేశానికి రెమ్‌డిసివర్ ఇంజెక్షన్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామాగ్రిని అమెరికా పంపిన సంగతి తెలిసిందే.అటు అగ్రరాజ్యానికి చెందని 40 కార్పోరేట్ సంస్థలు కూడా భారత్‌‌కు మిలియన్ డాలర్ల సాయాన్ని అందజేశాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube