ఈ పరిస్థితిని చూసి క్రుంగిపోవాల్సిన అవసరం లేదు: రాయ్ లక్ష్మి

టాలీవుడ్ నటి లక్ష్మీ రాయ్.ఈమె తెలుగులో పలు సినిమాలో నటించగా అంత సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది.కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లక్ష్మీ రాయ్ ఆ తర్వాత అప్పుడప్పుడు పలు సినిమాలలో నటించింది.2019లో వేర్ ఈస్ ది వెంకటలక్ష్మి సినిమాలో చివరగా నటించగా మళ్లీ అవకాశాలు కూడా అందుకోలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటుంది.

 Tollywood, Actress Lakshmi Raai, Tallks, Covid 19,latest Socila Media-TeluguStop.com

Telugu Actresslakshmi, Covid, Tallks, Tollywood-Movie

ఇక తాజాగా ఈ బ్యూటీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.కరోనా మహమ్మారి ప్రభావం వల్ల సమాజంలో జరిగిన కొన్ని పరిస్థితులను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.ప్రతి ఒక్క విషయంలో ప్రజలు తెలుసుకోవాల్సిన గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయని అంటుంది.

ప్రస్తుతం పరిస్థితులవల్ల నియంత్రిత జీవనం గడుపుతున్నామనే భావనను వదిలేయమంటుంది.

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారని కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని కొంత సమయం వరకు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండమని కోరింది.

దీని వల్ల మానసిక ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని తెలిపింది.ఇక ఈ పరిస్థితుల వల్ల చాలా వరకు జీవిత విలువ అంటే తెలిసిందని, ఇతరుల కష్టాన్ని మరో కోణంలో చూస్తే ధోరణి పెరిగిందని తెలిపింది.

Telugu Actresslakshmi, Covid, Tallks, Tollywood-Movie

ప్రస్తుతం పరిస్థితులవల్ల చాలా మందిలో బాధ్యతలు ఏర్పడ్డాయని అంటుంది.ఈ సామూహిక పోరాటంతోనే ఈ వైరస్ ను తరిమి కొట్టవచ్చుననే నమ్మకం పెరిగిందట.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఇవన్నీ మంచి విషయాలని తెలిపింది.ఇక అదే సమయంలో లాక్ డౌన్ పరిస్థితుల్ని చూసి కృంగి పోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

పైగా ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వ్యక్తిత్వాన్ని మరింత దృఢ పరుచుకోవడానికి సరైన సమయం అని తెలిపింది.ఇక తను కూడా యోగ పై దృష్టి పెట్టిందట.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ లాక్ డౌన్ ని గడుపుతున్నానని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube