కరోనా వైరస్ నేపథ్యంలో అనేక మంది వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆసుపత్రుల వెంట పరుగులు పెట్టడం మనం చాలానే చూశాం ఈ మధ్యకాలంలో.అయితే వారి సమస్యను ఆసరాగా తీసుకున్న హాస్పిటల్ చికిత్స పేరుతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి.
అందుకు సంబంధించి ఎన్నో వార్తలు మనం ప్రతిరోజు మీడియా పూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నాం.అయితే తాజాగా ఈ విషయం పై టాలీవుడ్ యంగ్ హీరో హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద మొత్తంలో ప్రజల నుంచి ఆసుపత్రులు ట్రీట్మెంట్ చార్జీలను వసూలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
కరోనా భయంతో చేరిన ప్రజలని ఆస్పత్రి వారు ఏ సర్జరీ అయినా సరే లక్షలకు లక్షలలో బిల్లు కట్టించుకుంటున్నారు అని ఆసుపత్రి బిల్లులపై తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ ట్విట్టర్ పూర్వకంగా ఆవేదన వ్యక్తం చేశాడు.ఇందులో భాగంగానే హీరో నిఖిల్ తెలియజేస్తూ.‘తాను చాలా మంది ఆసుపత్రి బిల్లులు పరిశీలించాలని అందులో ఎక్కువ మంది కి బిల్లులు పది లక్షలకు మించి ఉన్నాయని తెలియజేశాడు.అలాంటి వారి కోసం తాము వీలైనంత సహాయం చేస్తున్నామని.అయితే బిల్లులు వసూలు చేయడంలో మాత్రం ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నట్లు’ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా సాధారణ సర్జరీ లకు కూడా మన దగ్గరలోని ఆసుపత్రులు ఎందుకు ఇంత దారుణమైన మొత్తాన్ని ప్రజల నుంచి దోచుకుంటున్నాయో అర్థం కావట్లేదని ఇలాంటి సమస్యలకు ఎవరు అడ్డుకట్ట వేయలేరా అంటూ ఆసుపత్రి యాజమాన్యాలపై హీరో నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇకపోతే కరోనా సమయంలో హీరో నిఖిల్ తనకు వీలైనంత సహాయాన్ని అందజేశారు.తను, అలాగే తన టీంతో కలిసి కరోనా బాధితులకు నిత్యావసరాల సహాయం అలాగే ఆర్థికంగా కూడా ఆయన సహాయాన్ని అందించారు.