అయ్యబాబోయ్: బొద్దింకకు ఐసీయూలో చికిత్స..!

థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ లో నివసిస్తున్న దను లింపపట్టనవానిచ్ అనే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఓ బొద్దింక కనిపించింది.ఎవరో ఆ బొద్దింకని పొరపాటున తొక్కేశారు.

 Thailand Man Gave Treatment To A Injured Cockroach In Hospital Icu , Icu , Treat-TeluguStop.com

ఇక గాయాలతో ఆ బొద్దింక అక్కడి నుంచి కదల్లేక విలవిల్లాడుతోంది.దాని పరిస్థితి చూసి దను చాలా బాధ పడ్డాడు.

తక్షణమే ఆ బొద్దింకని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు.వెంటనే ఆ గాయలతో బాధ పడుతున్న బొద్దింకను తన అరచేతిలో పెట్టుకుని సాయి రాక్ యానిమల్ హాస్పిటల్‌కు వెళ్ళాడు.

అక్కడున్న సిబ్బంది కూడా అతడు బొద్దింకను తీసుకొచ్చాడని ఏమి ఎగతాళి చేయలేదు.ఆ ఆసుపత్రిలోని డాక్టర్ లింపపట్టనవానిచ్ కూడా ఆ బొద్దింకను ఎమర్జెన్సీ రోగిగానే భావించాడు.

దానికి ఉచితంగా వైద్యం చేస్తానని దనుకు చెప్పడం జరిగింది.ఈ అరుదైన వింత ఘటన గురించి ఆ డాక్టరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది.

Telugu Cockroach Icu, Crcokroach, Dhanu, Icu, Sai Rock Animal, Thailand, Cockroa

ఆ బొద్దింక బతికేందుకు 50 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని ఆ డాక్టర్ తెలిపాడం జరిగింది.

‘‘ఇక ఇది జోక్ కాదు.ఒక మానవత్వం వున్న మనిషిగా ప్రతి జీవి పట్ల కరుణ, జాలి. లోకంలో ప్రతి జీవి జీవితం విలువైనది.ఈ లోకంలో ఇలాంటి వ్యక్తులు మరింత మంది ఉండాలని కోరుకుంటున్నాను.ఈ లోకానికి దయకలిగిన మనుషులు ఎంతో ముఖ్యం’’ అని తెలిపాడు.

‘‘ఇప్పటిదాకా బొద్దింకను కాపాడమని ఎవరూ రాలేదు.నా సర్వీసులో ఫస్ట్ టైం ఇలా జరిగింది.

ముఖ్యంగా ఇటువంటి చిన్న ప్రాణికి ఎప్పుడూ ట్రీట్మెంట్ చెయ్యలేదు.

Telugu Cockroach Icu, Crcokroach, Dhanu, Icu, Sai Rock Animal, Thailand, Cockroa

ఆ బొద్దింకని బతికించడం నాకు ఛాలెంజ్ అనిపించింది.ఎందుకంటే.అంత చిన్న ప్రాణికి ఆక్సిజన్ అందించడం అంత ఈజీ కాదు.

అందుకే ఆ బొద్దింకని ఆక్సిజన్‌ కంటైనర్‌లో పెట్టడం జరిగింది.అందువల్ల కనీసం ఆ బొద్దింక ఊపిరి పీల్చుకుని బతికే అవకాశాలు ఉంటాయని అనుకున్నాం.

ఆ బొద్దింక బ్రతికి బయటపడిన తర్వాత.నువ్వే దాని బాగోగులు చూసుకోవాలని అతడికి చెప్పాను.

ఇందుకు అతడు అంగీకరించడం జరిగింది’’ అని డాక్టర్ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube