విదేశాలలో చదువుతూ..స్వదేశంలో ఉండిపోయిన భారత విద్యార్ధులకు కేంద్రం గుడ్ న్యూస్...!!

కరోనా మహమ్మారి ప్రభావం అంచెలంచలుగా పెరుగుతోంది.మొదటి వేవ్ తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో రెండవ వేరేయంట్ గా రూపాంతరం చెందిన కరోనా మూడవ వేరియన్ దిశగా మార్పు చెందుతోందని దీన్ని కూడా ఎదుర్కునేందుకు అందరూ సిద్దంగా ఉండాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి.

 Central Govt Help To Students Studying Abroad Now Stuck In India, Central Govt ,-TeluguStop.com

ఈ పరిస్థితి అన్ని దేశాలలో ఉండగా భారత్ లో తీవ్రంగా మారుతోంది.అయితే కరోనా కారణంగా విదేశాల నుంచీ భారత్ వచ్చేసిన భారతీయులు ఎంతో మందికి ఈ పరిస్థితులు ఇబ్బంది కరంగా మారుతున్నాయి.

ముఖ్యంగా విదేశాలలో చదువుతూ భారత్ వచ్చి చిక్కుకుపోయిన మన విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

విదేశీ ప్రయాణాలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్న నేపధ్యంలో వారి విద్యార్ధి జీవితంపై ఆందోళన చెందుతున్నారు.

పలు కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.ఈ తరుణంలో అమెరికాకు చెందిన సుమారు 400 కాలేజీలు, యూనివర్సిటీలు తమ వద్ద చదువుకునే విద్యార్ధులకు పలు కీలక సూచనలు చేశాయి.

శీతాకాలం కంటే ముందుగానే విద్యార్ధులు కరోనా వ్యాక్సిన్ లు వేసుకోవాలని సూచించాయి.దాంతో విద్యార్ధుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

విదేశాల్లో చదువుతూ స్వదేశంలో చిక్కుకు పోయిన భారత విద్యార్ధులు ఎవరైనా తాము పడుతున్న ఇబ్బందులు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించింది.ఇందుకోసం రెండు ఈ మెయిల్స్ ను కూడా విడుదల చేసింది.us.oia2@mea.gov.in అలాగే so.oia2@mea.gov.in‌ ఈ రెండు మెయిల్స్ కు విద్యార్ధులు వారి సమస్యలు వారి వారి ఈ మెయిల్స్, ఫోన్ నంబర్స్ వివరాలను పంపాలని సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube