మళ్లీ టీడీపీ లో ఎన్టీఆర్ డిమాండ్ ? కలవరపడుతున్న బాబు

ఎంతగా కంట్రోల్ చేద్దామని చూస్తున్న తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ డిమాండ్ వినిపిస్తూనే ఉంది.జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందని నమ్మే వాళ్ల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

 Fans Unfurled The Flag Tget Ntr Into Politics  Jr Ntr,kuppam, Chandrababu, Nara-TeluguStop.com

ఎన్టీఆర్ మాత్రం ఇప్పట్లో టిడిపిలోకి కానీ, రాజకీయాల్లో కానీ ఎంట్రీ ఇచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి గా లేరు.సినిమాలకే సమయం అంతా కేటాయిస్తున్నారు.

అది కాకుండా ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చినా  ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయము ఎన్టీఆర్ లో ఉంది.అందుకే ఆయన ఈ విషయంలో ఎన్ని రకాల వార్తలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు.

గతంలో టిడిపి తరఫున యాక్టివ్ గా ఉంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్ ఆ తరువాత తలెత్తిన పరిణామాలతో పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

కాకపోతే టిడిపి యువ నాయకులతో పాటు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఎన్టీఆర్ యాక్టివ్ అవ్వాలని, టిడిపిని అధికారంలోకి తీసుకు రావాలని కోరుతున్నారు.

గతంలో అనేక చోట్ల ఈ డిమాండ్ ను స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు లోకేష్ వంటి వారి ముందే వినిపించిన అభిమానులు మళ్లీ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ లో జెండాను ఆవిష్కరించారు.కుప్పం మండలం మంకల దొడ్డి పంచాయతీ మలకల పల్లి గ్రామంలో ఈ జెండా వెలిసింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు దీనిని ఆవిష్కరించినట్లుగా తెలుస్తోంది.

Telugu Ap, Chandrababu, Jr Ntr, Jr Ntr Demand, Kuppam, Lokesh, Young Tiger, Ysrc

అయితే ఈ వ్యవహారంపై టిడిపి నాయకులు ఎవరు స్పందించేందుకు ముందుకు రాలేదు.అసలు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏదైనా స్టేట్మెంట్లు ఇస్తే అధినేత చంద్రబాబు నుంచి తలనొప్పులు తప్పవనే ఉద్దేశంతో టిడిపి క్యాడర్ అంతా సైలెంట్ అయిపోయింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్న టిడిపి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

పార్టీ క్యాడర్ చెల్లాచెదురయ్యారు.నాయకులను పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం సన్నగిల్లడంతో ఎక్కడికక్కడ జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ తెరపైకి వస్తోంది.

న్టీఆర్ టిడిపి లో యాక్టివ్ అయితే లోకేష్ రాజకీయ జీవితానికి ఇబ్బంది ఏర్పడుతుంది అనే భయం చంద్రబాబులో ఎక్కువగా ఉండడంతోనే చాలాకాలంగా ఆయనను పక్కన పెట్టారు.ఎవరు ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చినా చంద్రబాబు ఆగ్రహానికి గురి కావాల్సిందే.

అయితే టిడిపి క్యాడర్ కాకుండా ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ డిమాండ్ ను తెరపైకి తేవడంతో   ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదని ,ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ మరింత బలపడుతుందని భయం చంద్రబాబులో ఉందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube