ఆదిలాబాద్ రిమ్స్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు..!

కరోనా టైం లో హాస్పిటల్స్ లో ఖాళీలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది.మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సరిపడినంత సిబ్బంది తప్పనిసరి అందుకే హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీల మీద తెలంగాణా ప్రభుత్వ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

 Adilabad Rims Hospital Outsourcing Jobs Notification Details, Adilabad,  Adilaba-TeluguStop.com

ఈ క్రమంలో ఇప్పటికే డాక్టర్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేయగా లేటెస్ట్ గా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.భారీ ఎత్తున ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

రిమ్స్ హాస్పిటల్ లో మొత్తం 25 విభాగాల్లో ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.దరఖాస్తుల ప్రక్రియ జూన్ 7 సోమవారం నుండి ప్రారంభం అవుతుందని ప్రకటించారు.

ఇక రిమ్స్ లో ఏయే పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది అంటే.స్టాఫ్ నర్స్ 144, స్టోర్ కీపర్ 6, స్టెనో/ టైపిస్టు 11, రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్ 6, క్యాథ్ ల్యాబ్ టెక్నిషియన్ 2, పెర్ఫ్యూజనిస్ట్ 1, ఈ.ఈ.జీ టెక్నిషియన్ 2, ఈసీజీ టెక్నిషియన్ 4, ల్యాబ్ అసిస్టెంట్ 15, ఎలక్ట్రిషియన్ 2, ప్లంబర్ 1, పీ.ఆర్.ఓ 2, ల్యాబ్ అటెండెంట్ 8, దోబీ 2, బార్బర్ 1, రెసిప్రేటరీ థెరపిస్ట్ 2, చెస్ట్ ఫిజియోథెరపిస్ట్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 3, ఫార్మసిస్ట్ 3, రేడియో గ్రాఫర్ 4, సిటీ టెక్నిషియన్ 4, డిజిటల్ ఇమేజింగ్ టెక్నిషియన్ 2, ఎం.ఆర్ టెక్నిషియన్ 4, ఓటీ టెక్నిషియన్ 4, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్స్ 12 మందికి నోటిఫికేషన్ వచ్చింది.మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube