ఫస్ట్ వెబ్ సిరీస్ తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న సమంత

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత.ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో సమంతా ఆడిపాడింది.

 Samantha Got A Good Response For The Family Man 2, Tollywood, Bollywood, Shakunt-TeluguStop.com

ఇక తన మొదటి సినిమా హీరో నాగ చైతన్యని ప్రేమించి అక్కినేని ఇంటి కోడలిగా సమంత మారిపోయింది.ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇంకా హీరోయిన్ గా ఈ అమ్మడు తన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంది.

పెళ్లి తర్వాత మజిలీ, రంగస్థలం, ఓబేబీ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టడమే కాకుండా నటిగా కూడా తనని తాను మరింత బెటర్ గా ప్రూవ్ చేసుకుంది.కెరియర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలే చేసిన ఇప్పుడు మాత్రం సెలక్టివ్ గా మంచి కథ, కథనాలతో పాటు తన పాత్ర ప్రాధాన్యత చూసుకొని సినిమాలని ఒప్పుకుంటుంది.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీలో సమంత నటిస్తుంది.ఇదిలా ఉంటే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ 2 ద్వారా ఆమె డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది.

Telugu Bollywood, Samantha, Shakuntalam, Tollywood-Movie

ది ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ కి కొనసాగింపుగా ఈ రెండో సీజన్ వెబ్ సిరీస్ లో సమంత కీలక పాత్రలో నటించింది.హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదటి పార్ట్ మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం ది ఫ్యామిలీ మెన్ 2 పై  భారీ హైప్ క్రియేట్ అయ్యింది.అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత తమిళ్ ప్రజల నుంచి ఈ వెబ్ సిరీస్ పై కొంత వ్యతిరేకత వచ్చింది.

దీంతో పెద్దగా ప్రమోషన్ చేయలేకపోయారు.అయితే ఈ వెబ్ సిరీస్ తాజాగా రిలీజ్ అయ్యింది.

తమిళ ప్రజలని కించపరిచే విధంగా ఎలాంటి అంశాలు ఇందులో లేవని ప్రూవ్ అయిపొయింది.దాంతో పాటు తమిళ్ టైగర్ రాజ్యలక్ష్మి పాత్రలో సమంతా పెర్ఫార్మెన్స్ కి విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి.

ఎన్నో అవమానాలు, ఎదురుదెబ్బలు తిని తీవ్రవాదిగా మారిన అమ్మాయి పాత్రలో సమంతా అద్బుతమైన నటనని ప్రదర్శించింది అంటూ అభినందనలు లభిస్తున్నాయి.ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 కి సమంత బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది.

ఈ వెబ్ సిరీస్ తో తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది అందరికి అర్ధమయ్యేలా చేసింది.దీంతో ప్రస్తుతం బిటౌన్ లో కూడా ది ఫ్యామిలీ మెన్ 2 లో సమంతా పెర్ఫార్మెన్స్ గురించి చర్చించుకోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube