యాంటీబాడీలను గుర్తించే బ్లడ్ టెస్ట్..!

కరోనా సోకకుండా ఉండాలంటే యాంటీబాడీలు చాలా అవసరం కరోనా వైరస్ ను ఈ యాంటీబాడీస్ సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.కరోనా నుండి కోలుకున్న వారిలో.

 Rapid Blood Test For Anti Bodies Covid 19, Anti Bodies,  Blood Test , Corona,  A-TeluguStop.com

లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ యాంటీ బాడీలు ఉంటాయి.అయితే ఇప్పటివరకు దాన్ని కనిపెట్టే విధానం అమలులేదు.

కాని ఓ చిన్న బ్లడ్ టెస్ట్ తో యాంటీబాడీలను గుర్తించొచ్చని కనిపెట్టారు అమెరికాలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు.కేవలం ఐదు నిమిషాలలోనే ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా యాంటీబాడీలను కనుక్కోవచ్చని వారు చెబుతున్నారు.అక్కడ 400 మంది కొవిడ్ పేషెంట్స్ నుండి సేకరించిన్ బ్లద్ శాంపిస్ లో ఈ టెస్ట్ చేయగా 87.5 శాతం  యాంటీబాడీలను గుర్తించినట్టు తెలుస్తుంది.

యాంటీబాడీలను గుర్తించేందుకు లేటరల్ ప్లో టెస్ట్ చేస్తారు.అయితే ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా దాని కంటే వేగంగా రిజల్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.ఇది చేయాలంటే టెస్ట్ చేయాల్సిన వ్యక్తి వేలి నుండి బల్డ్ డ్రప్స్ తీసుకుని ఒక కార్డ్ పై వేయాల్సి ఉంటుంది.దానిపై ఫ్యూజన్ పొటీన్ ఉంచి యాంటీబాడీలను గుర్తిస్తారని సమాచారం.

అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో అన్న విషయాన్ని కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుందని చెబుతున్నారు.మరి ఈ టెస్ట్ ట్రయల్స్ ఓకే అయితే మాత్రం యాంటీబాడీలను గుర్తించే టెస్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube