వీడియో వైరల్: తన పెళ్లి బరాత్‌ లో తానే డ్యాన్స్ చేసిన వరుడు..!

లాక్ డౌన్ ఎఫెక్ట్ మామూలుగా లేదు.కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.

 Video Viral: Groom Dancing Himself At His Wedding ..! Viral Video, Viral News, D-TeluguStop.com

లాక్ డౌన్ ఎఫెక్ట్ శుభకార్యాలపైనా పడింది.మరీ ముఖ్యంగా పెళ్లిళ్లపై బాగా పడింది.

లాక్ డౌన్ కారణంగా జరగాల్సిన వివాహాలు అగిపోయాయి.దీంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న వారు తీవ్రంగా నష్టపోయారు.

అప్పుల పాలయ్యారు.అంతేకాదు, పెళ్లి చేసుకోవాలని అనుకునే మరో ముహూర్తం కోసం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లాక్ డౌన్ దెబ్బకు ఏప్రిల్, మేలో జరగాల్సిన వివాహాలు వాయిదా పడ్డాయి.అయితే ఆ తర్వాత పెళ్లిళ్లకు అనుమతి ఉన్నా 50 మందికి మించి బంధువులు రాకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది.

ఈ క్రమంలో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.అటు ఆగస్టు వరకూ వేలాది వివాహాలకు ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే పెళ్లి ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులు చేశారు.దీంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇలా ఉండగా ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది.తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు.

అందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.అయితే, ఆ ప్రయోగాలు సక్సెస్ అయితే ప్రశంసలు అందుకుంటారు.ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మాత్రం అడ్డంగా బుక్కైపోతారు.తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు తన వివాహం సందర్భంగా ఏర్పాటు బరాత్‌లో ఆడవాళ్లతో కలిసి తానొక్కడే డ్యాన్స్ చేశాడు.అయితే, ఆ డ్యాన్స్ చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరంటే అతిశయోక్తి కాదు.

అందరూ అతని డ్యాన్స్ చూసి నవ్వుకున్నారు.ఆ వీడియోలో కొందరు మహిళలు రోడ్డుపై పెళ్లి వాహనం ముందు నిలుచుని ఉండగా డీజే సౌండ్‌కు తగిన రీతిలో స్టెప్పులు వేస్తూ రెచ్చిపోయాడు.

తనకు నచ్చిన రీతిలో వింత వింత స్టెప్పులతో డ్యాన్సును ఇరగదీశాడు.పెళ్లి కొడుకు డ్యాన్స్ చూసి అక్కడ ఉన్న ప్రజలు నివ్వెర పోయారు.

అయితే, వరుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

దాదాపు 30 లక్షల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను చూశారు.లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube